1) స్మోకింగ్ చేసే ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను గత పది సంవత్సరాల నుండి స్మోకింగ్ చేస్తున్నా , కానీ నేను బాగానే ఉన్నా అనుకుంటారు. ఇప్పుడు ఏమీ కాకపోయినా , జీవితం చివరి గడియల్లో నరకం చూపిస్తుంది. అప్పుడు కుటుంబం తో సంతోషకరమైన జీవితం గడపలేరు.

2) సాదారణంగా 50+ తర్వాత వ్యాధినిరోధక శక్తీ తగ్గుతూ వస్తుంది. దానికి తోడు మీ ఊపిరితిత్తులు కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీల్చడం వల్ల , నల్లగా మొద్దుబారి పోతాయి. దీనిమూలంగా శ్వాస అందకపోవడం , అస్తమా , నిరంతర పసిడం , దగ్గు , చివరికి ఉప్పిరితిత్తుల కాన్సర్ వచ్చి , జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.

3) ఇవే కాకుండా , పొగాకు ఉత్పత్తులైన ఖైని , గుట్కా ఏవి తీసుకున్నా గొంతు కాన్సర్ , కంటిలో కార్నియా దెబ్బతినడం , ప్రోస్టేట్ కాన్సర్ , లివర్ కాన్సర్ ... ఇలా చెప్పుకొంటూ పోతే స్మోకింగ్ చిట్టాలో కాన్సర్ మాత్రమే మిగులుతుంది.

4) కాబట్టి ఫ్రెండ్స్ , స్మోకింగ్ , డ్రింకింగ్, డ్రగ్స్ కి భానిసలవ్వకుండా , ఒక వేళ ఇప్పటికి అలవాటు ఉంటె మెల్లగా మానేసి , కుటుంబంతో సంతోషంగా ఉంటూ , నలుగురికి తోచిన సహాయం చేస్తూ , ఆనందంగా ముందుకు సాగిపోదాం.

మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం షేర్ చెయ్యండి కనీసం ఇది చదివి నాకా మనలో కొంత మంది మానే అవకాశం వుంది


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved