గురక వల్ల గుండెకు పొంచి ఉన్న ప్రమాదం

Snoring can cause Heart disease

గురక వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు, గురక పెట్టే వారి సంగతి అటుంచితే ఆ గురక వాళ్ళ నిద్రాభంగమై ఇబ్బంది పడే వారి బాధ వర్ణనాతీతం. ఇప్పటి వరకు గురక సర్వసాధారణ విషయం, అంతే కాదు గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల గుండెకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది..

గురక - కారణాలు

గురక పెట్టడానికి అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు, లేదా కొండ నాలుక పొడుగ్గా ఉండటం, మెడ అతి సన్నగా ఉండటం లేదా ఏ కారణం చేతనైనా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నప్పుడు శ్వాస పీల్చడం కష్టమై నోటితో శ్వాస పీలుస్తుంటారు . ఈ క్రమంలో గొంతులో ఉండే సాఫ్ట్ పాలెట్ కణజాలం కదలికల వల్ల గురక వస్తుంది. మనం సాధారణంగా కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడో మన నోట్లో ఉండే నాలుక ఫ్లాట్ గా ఉండి కొండ నాలుక నిలువుగా ఉంటుంది. మనం ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు గాలి ముక్కు రంద్రాల ద్వారా లోపలి వెళ్లి గొంతు ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కానీ పడుకున్నప్పుడు, ముఖ్యంగా గురక పెట్టేవారిలో కొండనాలుక గొంతులోని వెనుక భాగాన్ని కప్పేస్తుంది, అందువల్ల ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది, కాబట్టి నోటితో గాలి పీల్చడం మొదలుపెడతారు.

గురక - అనారోగ్యం

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే గురకపెట్టే వారందరికీ గురక వ్యాధి ఉన్నట్టు కాదు. అలాగని గురక పెట్టేవారందరికి ఆరోగ్య సమస్యలు రావు. గురక గురకలా ఉంటె సమస్యేం లేదు, అది ఇబ్బందికరంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. గురకపెట్టే వారిని గమనిస్తే వారు మధ్య, మధ్యలో దగ్గుతుంటారు , నోటితో శ్వాస పీలుస్తూ ఇబ్బంది పడుతుంటారు.గురకను నిర్లక్ష్యం చేస్తే క్రమేణా వ్యాధి ముదిరి గాలి లోపలికి వెళ్ళే ప్రక్రియ పూర్తిగా నిలిచి పోతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అందక గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం మొదలుపెడుతుంది.. గురక వ్యాధి వున్నవారికి రక్తపోటు, మదుమేహం లాంటి వ్యాధులు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్రలేమి, శరీరానికి సరిపడా పోషకాలు అందక ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతక మయ్యే అవకాశాలు ఉన్నాయి.

గురక నివారణ

గురకను ఒక్కసారిగా నివారించడం కష్టమే, కానీ అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. బరువు తగ్గడం, ఆల్కహాల్ తగ్గించడం, సిగరెట్లకు దూరంగా ఉండటం మొదటిదైతే, రాత్రి పడుకునేటప్పుడు వెల్లకిలా కాకుండా ఒక వైపుకు తిరిగి పడుకోండి, తద్వారా నోరు తెరుచుకునే అవకాశం తక్కువ కాబట్టి ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్లి గురక తగ్గుతుంది.

1. బరువు తగ్గించుకోవడం : మీ వయసుకీ , మీ ఎత్తుకీ ఉండవలసిన బరువు కన్నా కేవలం కొన్ని కిలోలు ఎక్కువ ఉన్నా కూడా గురక వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది. అందువలన గురక నివారణ లో మొదటి చర్య గా బరువు తగ్గించుకోవాలి ! ఇది అనేక రకాలు గా త్వరితం చేసుకోవచ్చు . పథ్యం తోనూ , వ్యాయామం తోనూ ! బరువు ఎక్కువ అవుతున్న కొద్దీ , మెడ లోపల ఉన్న కండరాల చుట్టూ కొవ్వు పేరుకుని శ్వాస నాళాల వ్యాసాన్ని తక్కువ చేస్తుంది అనే విషయం ముఖ్యం గా గుర్తు ఉంచుకోవాలి !

2 . వెల్లికిలా కాకుండా పక్కకు ఒరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి : దీనివలన గొంతులో శ్వాస సమయం లో నాలుకా, ఇతర కండరాలూ వెనక్కి వెళ్లి శ్వాస తీసుకోవడం కష్టమయే పరిస్థితి ఏర్పడదు.

3. మద్యం తాగడం మానుకోవాలి: ప్రత్యేకించి మద్యం తాగి పడుకోవడం మానుకోవాలి : ఎందుకంటే మద్యం మన కండరాలనన్నిటినీ వ్యాకోచ పరుస్తుంది అంటే రిలాక్స్ చేస్తుంది దానితో గొంతులో ఉన్న నాలుకా , ఇతర కండరాలు కూడా రిలాక్స్ అయి , అవి శ్వాస ద్వారాన్ని చిన్నది గా చేస్తాయి ! దానితో శ్వాస తీసుకోవడం కష్టమయి గురక వస్తుంది.

4 . స్మోకింగ్ మానుకోవాలి : స్మోకింగ్ గొంతు లోపలి భాగాలలో వాపు కు కారణమయి శ్వాస తీసుకోవడం ఎట్లా క్లిష్ట తరం చేస్తుందో , క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! స్మోకింగ్ మానుకుంటే ఆ మార్పులు నివారించ బడి శ్వాస సునాయాసం అవుతుంది !

5. CPAP యంత్రాలు : CPAP అంటే కంటిన్యు అస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ డివైస్ అని : ఈ పరికరం లేదా మెషీన్ ను OSA ఉన్న వారు అంటే , గురక తీవ్రత ఎక్కువ అయి , అది శ్వాస తీసుకోవడం కష్టం చేస్తున్న దశ లో వాడవలసిన పరికరం. ఈ పరికరం శ్వాస పీడనాల తేడాను కనిపెట్టి తదనుగుణం గా మార్పులు తెస్తుంది. దానితో శ్వాస మామూలు గా తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పరికరాన్ని రోజూ వాడాలి. స్పెషలిస్టు సలహా తోనే పై చర్యలు పాటించడం ఉత్తమం !

చాల మందికి ఇ ప్రాబ్లం వుంటుంది అందరికి షేర్ చెయ్యండి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved