ఆధార్ ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి.. విద్యాశాఖ వింత నిర్ణయం

సుప్రీం’ వద్దన్నా విద్యాశాఖ వింత నిర్ణయం! ‘పది’ విద్యార్థులకు శరాఘాతంగా మారిన అనుసంధానం నామినల్‌రోల్స్‌ సమర్పణకు గడువు పెంచాలి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల డిమాండ్‌ ఆధార్‌ ఉంటేనే పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులకు అనుమతి! విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులివి! ఆధార్‌ లేకుంటే పాఠశాలల నామినల్‌రోల్స్‌ స్వీకరించవద్దని ఆదేశాలు వెలువడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇక ప్ర భుత్వ ఉత్తర్వులు సరికాదంటూ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. ఇప్పటికే ఆన్‌లైన్ ‌లో తమ వివరాల నమో దుకు కుస్తీ పడుతున్న విద్యార్థులకు తాజాగా ఆధార్‌ అనుసం ధానమై ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రభుత్వం నిబంధన విధించడం వారిని ఆందో ళనకు గురి చేస్తోంది. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన ఐసీఆర్‌ దరఖా స్తుల్లో విద్యార్థుల ఆధార్‌నెంబర్లు తప్పనిసరిగా వేయాలని, లేనిపక్షంలో నామినల్‌రోల్స్‌ను స్వీకరించవద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ అన్నిజిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరులక్షల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆరులక్షలమంది విద్యార్థులు ఈ ఏడాది పదిపరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు లక్షన్నరమందికి ఆధార్‌ నెంబర్లు లేవని సమాచారం. పైగా ఆధార్‌కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వర్లు సక్రమం గా పనిచేయకపోవడం వల్ల యూఐడీ నెంబర్లు కూడా ఇప్పటికప్పుడు తీసుకువచ్చే ప రిస్థితి లేదు. డిసెంబర్‌ 15లోగా ఆధార్‌నెంబర్లను సమర్పించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసినప్పటికీ మరోవైపు డిసెంబర్‌ 2లోగా ఆధార్‌నెంబర్లతోసహా నామినల్‌రోల్స్‌ను అందజేయాలని మరో ఆదేశాలు రావడం ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తోంది. వాస్తవంగా నామినల్‌రోల్స్‌ను గత నెల 26లోగా అందజేయాలని విద్యాశాఖ అధికారులు గడువు పెట్టినప్పటికీ ఆ న్‌లైన్‌లో విద్యార్థుల వివరాల నమోదుకు సంబంధించిన వెబ్‌సైట్‌ సర్వర్‌ పనిచేయకపోవడంతో డిసెంబర్‌ 2వరకు గడువును పొడిగించారు.   6నుంచి 8 వ తరగతి వరకు విద్యార్థుల మార్కుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చే సి, ఆ కాపీని పదోతరగతి నామినల్‌ రోల్స్‌తోపాటు సమర్పించాలన్న ఆదేశా లు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులకు ఆధార్‌లేకపోవడం వల్ల మార్కుల జాబితా ఉన్నప్పటికీ, అనుసంధాన కాఫీలను నామినల్‌రోల్స్‌కు ఇచ్చే పరిస్థితి లేకపోవడం మరో సమస్యగా మారింది. ఆధార్‌ తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకులిలా మెలిక పెట్టడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా పాఠశాలలో 30మంది విద్యార్థులు పది పరీక్షలు రాయాల్సి ఉంటే వారిలో ఏఒక్కరికి ఆధార్‌ లేకపోయినా మిగిలిన 29మంది విద్యార్థుల నామినల్‌రోల్స్‌ కూడా స్వీకరించే పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. గడువు మరో రెండురోజులపాటు మాత్రమే ఉండటంతోపాటు నా మినల్‌రోల్స్‌కు ఆధార్‌ అనుసంధానం చేయటంతో మరో 20రోజులపాటు పెం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

must share


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved