అన్నిట్లో అగ్రగామి..

భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి శాస్త్రవేత్త.. తొలి అవివాహిత రాష్ట్రపతి..

రాష్ట్రపతి భవన్‌ గేట్లను సందర్శకుల కోసం తెరిచిన తొలి రాష్ట్రపతి..

వందల సంఖ్యలో విద్యార్థులతో సమావేశమైన రాష్ట్రపతి

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి బాలిస్టిక్‌ క్షిపణులకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త

సామాన్యుడి కోసం కరోనరి స్టెంట్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం టాబ్లెట్‌ను రూపొందించిన శాస్త్రవేత్త

అగ్ని, పృథ్వి.. తదితర క్షిపణుల తయారీలో కీలక పాత్ర

పోఖ్రాన్‌-2 అణుపరీక్షకు సారథ్యం

సుఖోయ్‌-30 యుద్ధ విమానంలో ప్రయాణించడంతో పాటు మూడు నిమిషాల పాటు నడిపిన తొలి రాష్ట్రపతి.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్‌ మంచు పర్వతాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రె్‌సలో ప్రసంగించిన తొలి రాష్ట్రపతి.

సబ్‌ మెరైన్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.

విజయానికి 4 మెట్లు

1. పెద్ద లక్ష్యం: చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం నేరం. మన లక్ష్యం ఎప్పుడూ ఆకాశమంత ఉండాలి.

2. జ్ఞాన సముపార్జన: మనిషి నిరంతర విద్యార్థిగా ఉండాలి. జ్ఞానంతో నిండిన మనిషి ఈ విశ్వంలోనే శక్తివంతుడు.

3. శ్రమించేతత్త్వం: విజయశిఖరాన్ని అధిరోహించాలంటే కష్టపడటం అనే మార్గం ఒక్కటే ఉంటుంది.

4. ఆత్మ విశ్వాసం: సమస్యలపై పోరాడేందుకు మనకు దేవుడిచ్చిన ఆయుధమే.. ఆత్మవిశ్వాసం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved