వినాయకుడికి ‘గరికె’ అంటే ఎందుకు ఇష్టం?

వినాయకుడికి ‘గరికె’ అంటే పరమ ప్రీతీ. గరికెను సంస్కృతంలో ‘దూర్వాయుగ్మం’అంటారు. గరికె.. ‘దర్భల’ జాతికి చెందిన మొక్క. ‘దర్భలు’ శ్రీ మహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయి. పైగా అమృత స్పర్శకు నోచుకోబడ్డాయి. అందుకే అవి అతి పవిత్రాలు. ఆ జాతికి చెందిన ‘గరికె’ కూడా దర్భలవలె పవిత్రమైనవి. అంతేకాక, గడ్డిపూలు ఉన్నాయి గానీ...‘గరికె’ పూవులు పూయదు. ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ‘గరికె’కు లేదు. అవి స్వయంభువాలు. కనుక సంపర్క దోషం లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడుగా జన్మించిన వినాయకునికి ‘గరికె’ అంత ఇష్టం. అందుకే ఆయన ‘దూర్వాయుగ్మ’ పూజను పరమ ప్రీతిగా స్వీకరిస్తాడు.

‘తెల్ల జిల్లేడు’కు ఎందుకంత పవిత్రత?

‘మారేడుచెట్టు’.......శివుని కి ప్రతిరూపం.
‘రావిచెట్టు’............శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం.
‘తులసిమొక్క’......శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం.
‘వేపచెట్టు’.............మహాశక్తికి ప్రతిరూపం. అలాగే..
‘తెల్లజిల్లేడుమొక్క’.......సాక్షాత్తు వినాయకునికి ప్రతిరూపం. ఎందుకంటే -
వంద సంవత్సరాలు బ్రతికిన తెల్లజిల్లేడుమొక్క, వినాయకుని ఆకృతిని సంతరించుకుంటుంది. అలాంటి మొక్కలో, వినాయకుడు శాశ్వతంగా నివసిస్తాడు.
అట్టి వినాయకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధస్తాయి. అందుకే తెల్లజిల్లేడుమొక్కకు అంత పవిత్రత, విశిష్టత.

‘పాలవెల్లి’ ఎందుకు కట్టాలి?

‘పాలవెల్లి’, ‘పాలపుంత’ అంతరిక్షంలోని గ్రహ, నక్షత్ర సముదాయానికి పర్యాయ పదాలు. దానికి ప్రతిరూపమే ఈ ‘పాలవెల్లి’. అంతరిక్షంలో వ్రేలాడే గ్రహ, నక్షత్రాలే. మనం పాలవెల్లికి కట్టే రకరకాల ఫలాలు, పుష్పాలు. సమస్త సృష్టికీ ఈ ఆదిదేవుడే అధినాయకుడు అని చెప్పడానికే మనం ‘పాలవెల్లి’ని కడతాం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved