ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 2017 డిసెంబర్ వరకు ఉచిత 4జీ కాల్స్, డేటా

రిలయన్స్ జియో దెబ్బతో టెలికామ్ కంపెనీలు దిగి వస్తున్నాయి. జియో 4జీ వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్త ఏడాది కానుకగా మార్చి 31 వరకు రిలయన్స్ పొడిగించింది. అయితే దీనికి పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 2017 డిసెంబర్ వరకు 4జీ కాల్స్, 3జీబీ డేటా ఉచితమని మంగళవారం ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్యాకేజీలపై మాత్రమే ఇది వర్తిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.

4జీ మొబైల్ కలిగినవారు ఎయిర్‌టెల్ 4జీ నెట్ వర్క్‌కు మారాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ 3జీ వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ కావాలి. ప్రీ పెయిడ్ వినియోగదారులు రూ.345 ప్యాకేజీతో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు 4జీ డేటాను 1జీబీ వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 4జీకి మారిన వారు ఇన్ఫినిటీ ప్యాకేజీలతో అపరిమిత కాల్స్‌తో పాటు నెలకు 3జీబీ డేటాను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ ఆఫర్ ఫిబ్రవరి 28తో ముగుస్తుందని ఎయిర్‌టెల్ ప్రకటించింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved