అమరావతిలో అసెంబ్లీ ఎలా ఉండబోతోందో తెలుసా?

అమరావతి నిర్మాణం తొలిదశలో పూర్తయ్యేది సీడ్ క్యాపిటల్ . దీంట్లో అసెంబ్లీ , సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు 2018 నాటికి సిద్ధం అయ్యేలా ప్రణాళిక తయారు చేశారు. కేపిటల్ లో ప్రముఖ ప్రాంతంగా మొదట రూపుదిద్దుకోబోతోంది కూడా ఇదే. స్టేట్ హెడ్ క్వార్టర్స్ ను వాస్తపరంగా కృష్ణానదికి ఉత్తర దిక్కున నిర్మించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. నీరుకొండ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు రాబోతున్నాయి. అసెంబ్లీ భవనాల ప్రాముఖ్యత దృష్టిలోపెట్టుకుని ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచే పోయాలే ప్రభుత్వ భవనాల నిర్మాణం ఉండబోతోంది. పరిపాలన పరంగా రాజధానిలో కీలక ప్రాంతం కూడా ఇదే. మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగా కాకుండా అమరావతిలో ప్రభుత్వం భవంతలకు ఒక ప్ర్తత్యేకత ఉండబోతోంది. ఎక్కడా లేని విధంగా హైటెక్ హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు ఉండబోతున్నాయి.

అసెంబ్లీ భవనాన్ని కూడా పర్యాటక ప్రదేశంగా మార్చాలన్నఆలోచన ఇందులో కనిపిస్తోంది. సిటి నిర్మాణంలో తొలిఅడుగు ఇక్కడ నుంచే మొదలు కాబోతోంది. సహజంగానే అందరి చూపు దీనిపై ఉండటం ఖాయం. అందుకే ఆధునిక శైలిలో భవనాల ముందు భారీ పచ్చదనం ఉండేలా వాహనాల పార్కింగ్ పై ఆంక్షలు లేకుండా విశాలంగా ఉండేలా మార్కింగ్ చేశారు. సెంట్రల్ పార్కు దగ్గరల్లోనే అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం ఉండబోతోంది . అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల పనితీరును దగ్గరగా ప్రజలు గమనించేలా పారదర్శక పాలనకు పెద్ద పీట వేసేలా మాస్టర్ ప్లాన్ తయారైంది. వ్యూహాత్మకంగానే వీటిని ప్రణాళికలో పొందుపరిచారు. ఇప్పటికే సీఆర్డీఏ ప్రభుత్వ భవనాల నమూనాల ఆర్కిటెక్కులతో కొత్త డిజైన్లను ఆహ్వానించింది. వరల్డ్ క్లాస్ లో బిల్డింగు ఆకృతులను రూపొందించాలని కోరింది.

మరో విషయం సచివాలయానికో ప్రభుత్వ కార్యాలయానికో వచ్చే వారికి అవసరమయ్యే అన్ని వసతులు అంటే ఫుడ్, క్యాంటీన్, షాపులు, హోటళ్లు కూడా దగ్గర ఉండేలా స్థలాల కేటాయింపు ఉండేలా ప్రణాళికను జాగ్రత్తగా తయారు చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత సమస్య రాకుండా ఏర్పాట్లు ఉంటాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved