అమరావతి అభివృద్ధికి మూడు దారులు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతాన్ని ఆర్ధికంగా బలపేతం చేసేందుకు మాస్టర్ ప్లాన్ లో భారీ స్కెచ్ వేశారు. అందుబాటులో ఉన్న వనరులను అమరావతికి ఆలంబనగా నిలిచే విషయంలో ప్రణాళిక తయారు చేశారు. ముఖ్యంగా రెండు నేషనల్ హేవేలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఎన్‌హెచ్‌ 5, 214లను వాడుకుని అభివృద్ధికి బాటలు పరిచేలా ప్లాన్ చేశారు. హైటెక్‌ ఇండస్ట్రియల్‌ బెల్ట్‌ను విమానాశ్రయానికి సమీపంలో అభివృద్ధి చేయడం ద్వారా మచిలీపట్నం నౌకాశ్రయానికి అనుసంధానం చేస్తారు. రాయలసీమ ప్రాంతానికి రాజధానికి కనెక్ట్ చేసే ప్రక్రియలో అటు బెంగళూరుతోనూ, ఎన్‌హెచ్‌ 9 ద్వారా హైదరాబాద్‌ను మార్గాలు మార్గదర్శి కాబోతున్నాయి. అమరావతిని తాకుతూ వెళ్తున్న ఈ రెండు జాతీయ రహదారుల్ని అనుసంధానిస్తూ 2 అర్బన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రతిపాదించారు. అంతేకాదు రహదారులు, జలమార్గాలు, విమానాశ్రయాలన్ని కలపడం ద్వారా రాజధాని ప్రాంతంతోపాటు విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి పరిసరాలు రాబోయే రోజుల్లో ఉపాధి కేంద్రాలుగా మారబోతున్నాయి. రోడ్డు, రైలు, విమానయాన, నౌకాశ్రయాల అభివృద్ధి ద్వారా విజయవాడను వాణిజ్య రాజధానిగా, గుంటూరుని విద్యా రాజధానిగా, ఇబ్రహీంపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా, మంగళగిరిని సరకు రవాణా కేంద్రంగా చేసేలా ప్రణాళిక తయారు చేశారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved