ఇల్లు కట్టుకోండి..! చౌక ధరల గృహాలపై ఏపీ వరాలు

డెవలపర్లకు, కొనుగోలుదారులకు రాయితీలు

ఇళ్ల ధరలు 15 శాతం తగ్గే అవకాశం

ఏపీ హౌసింగ్‌ పాలసీలో ప్రతిపాదనలు

దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల’ ఇళ్లపై వరాలు గుమ్మరించేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. చౌక ధరల ఇళ్ల డెవలపర్లకు, కొనుగోలుదారులకు భారీ రాయితీలు కల్పించాలని నిర్ణయించుకుంది. ఇంటి నిర్మాణానికి విధించే వివిధ పన్నులు, ఫీజుల్లో భారీ మినహాయింపులు కల్పిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రాయితీలు, వరాల వల్ల ఇళ్ల ధరలు దాదాపు 15 శాతం వరకు తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త హౌసింగ్‌ పాలసీ అమల్లోకి వచ్చిన మొదటి ఏడాది రూ.11,300 కోట్లతో 3 లక్షల చౌకధరల గృహాలు నిర్మించాలని నిర్ణయించారు

10 లక్షల ఇళ్ల కొరత

2012 గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో 1.8 కోట్ల ఇళ్ల కొరత ఉంది. ఏపీలోని పట్టణాల్లో 10 లక్షలు, గ్రామాల్లో 42 లక్షల ఇళ్లకు కొరత ఉంది. ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల ప్రజలు 95 శాతం మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 2022 నాటికి అందరికీ సొంతిళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. చౌక ధరల గృహాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సేవాపన్ను మినహాయింపు కల్పించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భారీ సంఖ్యలో చౌక ధరల గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. చౌక ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్రభుత్వం మొదటి ఏడాదిలో 11,300 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 3 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఆర్థిక వనరులు, భూమి కొరత, ఆకాశమే హద్దుగా పెరుగుతున్న భూముల ధరల కారణంగా ప్రైవేటు రంగం ఆసక్తి లేకుండా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. అందుకే, ప్రైవేటు రంగాన్ని ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు కల్పించాలని భావిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం సమగ్ర హౌసింగ్‌ పాలసీని రూపొందించింది. ఈ విధానంలో డెవలపర్లకు, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు కల్పించారు. ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ప్రస్తుతం లే అవుట్‌ అప్రూవల్‌ ఫీజును మున్సిపల్‌ శాఖ వసూలు చేయడం లేదు. అలాగే, ఇకపై చౌకధరల గృహాలు నిర్మించే ప్రైవేటు డెవలపర్లకు కూడా ఈ ఫీజుపై మినహాయింపు కల్పించాలని నిర్ణయించారు.

రూ.11,300 కోట్లతో 57,743 కోట్ల ఆదాయం

పన్నులు, ఫీజుల భారం తగ్గించడం వల్ల డెవలపర్లు చౌకధరలకే ఇళ్లు నిర్మించి ఇవ్వగలరని కేపీఎంజీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఎక్స్‌టర్నల్‌ డెవల్‌పమెంట్‌ చార్జీలు, ల్యాండ్‌ కన్వర్షన చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, వ్యాట్‌, సేవాపన్ను, ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలను సమీక్షించి వాటిని క్రమబద్ధీకరించి చౌక ధరల గృహ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని కేపీఎంజీ సూచించింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల వల్ల మరో 300 అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు ఊపందుకుంటాయని పేర్కొంది. గృహ నిర్మాణ రంగంలో పెట్టే ప్రతీ రూపాయి పెట్టుబడికి రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.2.84 మేర పెరుగుతుందని ఎనసీఈఏఆర్‌ నివేదించింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved