అరటి—ఆరోగ్యాల గని

అరటి చెట్టును సంస్కృతంలో కదళీ అని అంటారు. అరటి పండును కదళీఫలం అని పిలుస్తారు. ఈ చెట్టు సర్వాంగములు ఉపయోగమైనవి. అందుకే దీనిని కల్పవృక్షం అని కూడా అంటారు. అరటి చెట్టు తెలియని వారు ఉండరు. పూజలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైనది. అంతేగాక, అద్భుత ఔషధగుణాలు గల మొక్క. ఇది అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. దీని పచ్చికాయలను, పూలను, కాండాన్ని కూరగా వాడుతారు. వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అరటి పండ్లు తినటం వల్ల మంచి బలం వస్తుంది. దీనిలో విటమిన్ సి, ఎ, బి6, బి12 ఉన్నాయి. ఈ పండును తినటం వల్ల కడుపులో వుండే అల్సర్స్ తగ్గుతాయి. దీనిలో పొటాషియం , మెగ్నిషియంలు వుంటాయి. ఇవి మనిషి యొక్క భారాన్ని (స్ట్రెస్స్)ను తగ్గిస్తుంది. కాండం తినటం వల్ల కిడ్నిస్టోన్స్‌ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులలో భోజనం చేయుట శ్రేష్ఠమైనది. అరటి ఆకును ఎండబెట్టి ఆ తర్వాత కాల్చి బూడిద చేసి దాని నుండి క్షారం తీస్తారు. దీనిని పసుపుతో కలిపి బొల్లిపై రాయటవల్ల ఉపశమనం పొందవచ్చును.
**అరటిక్షారం
అరటిచెట్టు ఎండిన భాగాలను కాల్చి బూడిద చేసి ఈ బూడిదను నీళ్ళలో కలిపి వడబోసి వేడిచేస్తే దాని నుంచి క్షారం వస్తుంది. ఇది ఔషధంగా ఉపయోగించవచ్చును. ఇది కిడ్నిస్టోన్స్ తగ్గించుటకు, మూత్ర సంబంధ వ్యాధులకు వాడుతారు. అరటిలోని అన్ని భాగాలు ఈవిధంగా ఉపయోగపడుతాయి. ఇన్ని అద్భుతమైన ఔషధగుణాలు గల ఈ అరటి పండు నేడు తినాలంటే చాలా భయపడాల్సి వస్తుంది. ఈ అరటి పండును సహజసిద్ధంగా పండించడం లేదు. కృత్రిమ పద్ధతులలో పండిస్తున్నారు. ఈ కాయలపై కెమికల్స్ చల్లి పండిస్తున్నారు. ఈ పండ్లను తినటం అంటే పిల్లలకు విషాన్ని ఇస్తున్నట్లే. దీన్ని మన ప్రభుత్వం అరికట్టాలి. దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ఆస్కారం వుంది. ఈ పండ్లను సహజసిద్ధంగా పండించాలి. ఇలాచేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలగదు.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved