శాతకర్ణి ను దెబ్బతీసే విధంగా మాస్టర్ ప్లాన్ వేసిన అల్లు అరవింద్!

టాలీవుడ్ లో 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న రసవత్తరమైన పోరుకు అటు మెగా ఫ్యామిలీతో పాటు,ఇటు నందమూరి ఫ్యామిలీ కూడా సన్నద్ధం అయ్యింది.అంతేకాకుండా ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక అందరూ సంక్రాంతి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.అయితే తాజాగా అల్లు అరవింద్ శాతకర్ణి సినిమాను ఒకరకం గా దెబ్బ తీయదానికి ఒక మాస్టర్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది.శాతకర్ణి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు జనవరి 12 న రిలీజ్ కానుంది అని.ఇక ఇప్పటికే ఖైది ఫంక్షన్ ను 7 వ తారీఖు హాయ్ లాండ్ లో నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిసందే

అయితే దీనికి రెండూ రోజుల ముందే భారీ ఎత్తున ప్రమొషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పాడట.ఇక అరవింద్ కూడా దీనిని సీరియస్ గా తీసుకుని సినిమా రిలీజ్ అయిన 3 రోజుల వరకు ఏ రేంజ్ లో ప్రమొషన్ చేయాలో డిసైడ్ చేశాడట.అంతేకాదు సినిమాను కూడా శాతకర్ణి సినిమా రిలీజ్ అయ్యే రోజు 12 న రిలీజ్ చేయాలని నిర్ణయించాడట.ఒక రోజు ముందు రిలీజ్ చేసి ఒకవేళ సినిమాకు డివైడ్ టాక్ వస్తే శాతకర్ణి కు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అందుకే ఆ సినిమా రిలీజ్ అయిన రోజే రిలీజ్ చేద్దామని మెగా ఫ్యామిలీను ఒప్పించాడట అల్లు అరవింద్.ఇక ఖైది ట్రైలర్ ను కూడా దగ్గరుండి చాలా చక్కగా చేయించాడని టాక్.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved