-------ఆశయం-----

అశ లేనివాడు,అశయం లేని వాడు నిజమైన అవిటివాడు..

అడుగు ముందు కేస్తే ఏ మవుతుందోనని ఆవేదనచెందకు, నీ నీడ నీతో నేనున్నానంటుంది గమనించు, కనే కలలు కన్నీరుగా మారుతాయేమోనని కలవరచెందకు, జాలువారే నీ కన్నీటి కింద చిరునవ్వుల నిధి వుందని మరచిపోకు; అలుపెరుగని నీఆశ ఆవిరైపోతందేమోనని అనుమానపడకు, ఆ ఆశయాన్ని నెరవేర్చు అవకాశం కోసం మాత్రమే ఆరాటపడకు, పట్టుదల నీకుందో లేదో పరిశీలించుకో...........

మనం ఒక అడుగు ముందుకు వేస్తే నలుగురు దాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. ఇలా వెనక్కి లాగెవారు ఎక్కడో ఉండరు, మన చుట్టు ప్రక్కనే, ఒక్కోసారి మన ఇంట్లోనే ఉంటారు.కాని ఏదైన చేయాలి అనే పట్టుదల ఉన్నవారిని ఎవరూ ఏమి చేయలెరు. అనే ఇ సంగాతి మనం మరచి పోకుూడదు.అయితే, ఇలా వెనక్కి లాగే వారి వల్ల కూడా మనకెంతో ప్రయోజనం ఉంటుంది అనే సంగతి మరచిపోకూడదు.ఎందుకంటె ఈ వెనక్కి లాగే వారిలో మన కీడెంచే వారితో పాటు మన శ్రేయోభిలాషులు కూడా ఉంటారనే సంగతి గుర్తుంచుకోవాలి.మన చెడుకోరేవారైన, మన మేలు కోరేవారైన ,యే కారణం లేకుండా ఊరికినే “వద్దు ” అని అనరు కదా. చాలా మట్టుకు,ఏదో ఒక కారణం చెఫ్పడం జరుగుతుంది. అలాంటి కారాణలకి మనం భయపడకుండా, ఆలోచించగలిగితే చాలు, అ కారణాలు జయించటం తో పాటు,మనల్ని వెనక్కి లాగుతున్నారన్న నిరుత్సాహం బదులు, మనం వేసే అడుగు జాగ్రత్తగా పడడానికి వారికి తెలియకుండ వారే మనకి సహకరిస్తున్నారు అనుకుంటే ఇంకెంత ఉత్షాహంగా ఉంటుంది. కాబట్టి, దేనిలోనైన అనుకూల ధ్రుక్పధంతో ఉన్ననాడే ముందుకు సాగడం జరుగుతుంది.

నువ్వు అనుకున్నది ని ముందు వుంటుంది..


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved