వారఫలాలు (జన్మ తేది ప్రకారం)

జనవరి 20, 2016 నుంచి

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు) Aries

వృత్తిపరమైన సమావేశాలు, వేడుకలు, ఆర్థిక వ్యవహారాలు, రుణా లకు ఈ వారం అనుకూలం. బుధవారం సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. 21, 22, 23 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. 24, 25 తేదీల్లో చిన్నారులు, ప్రియ తముల విషయంలో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయి. 26న వైద్యం, పరిశ్రమలు, హోటల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు) Taurus

వృత్తి, వ్యాపారాలు, సమావేశాలు, బృందకార్యక్రమాలకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. బుధవారం వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 24, 25 తేదీల్లో ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుంది. బోధన, రవాణా, ఏజెన్సీ రంగాల వారు నిదానం పాటించాలి. 26, 27 తేదీల్లో బదిలీలు, మార్పులకు అనుకూలం. కుటుంబ వ్యవ హారాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 28, 29 తేదీల్లో సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు) Gemini

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు) Cancer

విలువైన వస్తువుల కొనుగోలు, విద్య, పెట్టుబడులు, ఆరోగ్య అంశా లకు ఈ వారం అనుకూలం. బుధవారం వారసత్వ విషయాలు లాభిస్తాయి. రాజ కీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. 24, 25 తేదీల్లో రుణప్రయ త్నాలు ఫలిస్తాయి. గత స్మృతులు నెమరు వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 26, 27 తేదీల్లో పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 28, 29 తేదీల్లో విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సోదరీసోదరుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు) Leo

స్పెక్యులేషన్లు, వేడుకలు, ప్రేమానుబంధాలు, కాంట్రాక్టులు, కుటుంబ విషయాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం బంధుమిత్రు లతో ఉల్లాసంగా గడుపుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. 24, 25 తేదీల్లో రాజ కీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. భాగస్వామి గురించి కీలక సమాచారం తెలుసుకుంటారు. 26, 27 తేదీల్లో వివాహాది శుభకార్యాల్లో పాలొం్గటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. 28, 29 తేదీల్లో ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహ కారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లలో నష్టం సంభవం.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు) Virgo

వృత్తిపరమైన నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, విద్య, ఆరోగ్య అంశాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. 24, 25 తేదీల్లో బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కొంత ఆశాభంగం తప్పక పోవచ్చు. 26, 27 తేదీల్లో దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. 28, 29 తేదీల్లో మెడికల్‌, ఆస్పత్రులు, ఆహార రంగాల వారికి శుభప్రదం. కొత్త పనులు చేపట్టడంలో ఆటంకాలు ఎదురవుతాయి.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు) Libra

ఉన్నత విద్య, చిన్నారుల విషయాలు, ప్రేమానుబంధాల విష యాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. ప్రియతముల నుంచి ముఖ్య సమాచారం లభిస్తుంది. 24, 25 తేదీల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవ కాశం ఉంది. 26, 27 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. పెట్టుబడులు లాభి స్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 28, 29 తేదీల్లో ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభి స్తాయి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు) Scorpius

కుటుంబ వ్యవహారాలు, బదిలీలు, వేడుకలు, స్థిరాస్తి విషయాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం గృహనిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. 24, 25 తేదీల్లో సమావేశాలకు, వేడుకలకు ఏర్పాటు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. 26, 27 తేదీల్లో ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 28, 29 తేదీల్లో వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు) Sagittarius

విద్యా విషయాలు, ప్రయాణాలు, చర్చలు, పెట్టుబడులు, ప్రేమాను బంధాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. బుధవారం శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. 24, 25 తేదీల్లో చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలించకపోవచ్చు. 26, 27 తేదీల్లో విద్యార్థులకు శుభప్రదం. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. 28, 29 తేదీల్లో పెద్దలతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం కలవరపెడుతుంది.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు) Capricornus

ఆర్థిక నిర్ణయాలు, వృత్తి, వ్యాపారాలు, పెట్టుబడులు, సమావేశాలకు ఈ వారం ప్రాధాన్యం ఇస్తారు. బుధవారం వృత్తి, వ్యాపారాల్లో అద నపు ఆదాయం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. 24, 25 తేదీల్లో స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. బహుమతులు ఇచ్చిపుచ్చు కుంటారు. ప్రియతముల కోసం ఖర్చులు అధికం. 26, 27 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 28, 29 తేదీల్లో పారి తోషికాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు.న కలిగిస్తాయి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు) Aquarius

వృత్తి, వ్యాపారాలు, సమావేశాలు, బృందకార్యక్రమాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం సృజ నాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. 24, 25 తేదీల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. 26, 27 తేదీల్లో జనసంబంధాలు విస్తరిస్తాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. 28, 29 తేదీల్లో గత స్మృతులు గుర్తుకు వస్తాయి. పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.ఖరి ఆవేదన కలిగిస్తుంది.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు) Pisces

వేడుకలు, విద్యా విషయాలు, సమావేశాలు, కొత్త పథకాలు, పెట్టు బడులపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం బదిలీలు, వేడుకలకు అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి శుభప్రదం. 24,25 తేదీల్లో విద్యా ర్థులకు శుభప్రదం. ప్రియతములకు సంబంధించిన కీలక సమాచారం అందు కుంటారు. 26, 27 తేదీల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో సమా వేశాలు, వృత్తిపరమైన చర్చలకు అనుకూలం. 28,29 తేదీల్లో సన్నిహితులకు సంబంధించి ఒక రహస్య సమాచారం తెలుసుకుంటారు. భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved