ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టే ఆడ కూతురు దీనగాధ

కడుపులోని పాప తల్లికి రాసిన ఉత్తరం.

హాయ్ అమ్మా... ఎలా ఉన్నావు?

ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నాను తెలుసా......?

నువ్వు నా అమ్మవైనందుకు హ్యాపీగా ఉంది.

మీ ప్రేమకు గుర్తుగా వచ్చానుకదమ్మా........

చాలా గర్వంగా ఉంది.

నాకు తెలుసు......... నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను...

అమ్మా....

నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా.......! పాపనైతే ఏం?

నీ కోసం నేను ఏమైనా చేస్తానమ్మా.....

ఏడవకమ్మా....

నువ్వు... నాన్న ఎందుకు తరుచుగా గొడవ పడుతున్నారు?

నాన్నని కొట్టొద్దని చెప్పమ్మా...

నీ పొట్టలో ఉన్న నా పొట్టకు దెబ్బలు తగులుతున్నాయి.

ఈ రోజు డాక్టర్ ని కలిశావా.......?

ఎందుకమ్మా........??

నేను బాగానే వున్నాను కదా....

ఏం జరుగుతుందమ్మా.....

నేనుండే చోటుకు ఇదేదో కొత్త వస్తువు వచ్చిందేంటి??

అదేమైనా కొత్త రకం బోమ్మనా...?

అమ్మా....

ఆ బొమ్మ నా వైపు దూసుకోస్తుందమ్మా.....

అమ్మా....

వాళ్ళను ఆపమ్మా.....

అది నాచేయి...

అయ్యో....

ప్లీజ్....

నాకు నొప్పిగా వుంది.

నన్ను గుచ్చోద్దని చెప్పమ్మా...

నన్ను కాపాడండమ్మా.....

నేను చిన్న పాపని కదా...

నన్ను నేను రక్షించు కోలేనని తెలుసు కదా...

అమ్మా.....

అది నా...... కాలు

వాళ్ళని ఆపమని చెప్పమ్మా.....

నీమీద ఒట్టమ్మా....

నేను నా కాళ్ళతో

నీ బోజ్జని తన్ననమ్మా....

వాళ్ళని ఆపమని చెప్పమ్మా....

వాళ్ళు మనుషులే కదా....

నన్నిలా ఎలా చేయగలుగుతున్నారమ్మా...

అ............... మ్మా............. ఇ.......... క......... న....... న్ను...... ర....... క్షిించ........మ్మా అ........మ్మా........

*****************************************************************

భ్రూణహత్యలు నేరం.....

పాపం.

భ్రూణహత్యలు ఆపుదాం

ఆడపిల్లలనూ బ్రతకనిద్దాం.

అందరూ షేర్ చేయండి ప్లీజ్


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved