బేబీకి డైపర్స్ వాడుతున్నారా? అయితే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి…

అనేక మంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం డిస్పోజబుల్ డైపర్ లను సులభంగా ఉపయోగించటం చూస్తున్నాము. అత్యధిక శోషణ గుణం గల డైపర్స్ ఉపయోగించడం వలన బయటకు వెళ్ళిన సమయంలో మరియు రాత్రి సమయంలో చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ ఈ డైపర్స్ తో ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అత్యధిక శోషణ గుణం గల డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించే పిల్లలకు డైపర్ రాష్ అనేది చాలా సాధారణ సమస్యగా ఉన్నది.

సాధారణంగా డైపర్ ఉపయోగించే పిల్లలకు తరచుగా డైపర్ దద్దుర్లు ఏర్పడతాయి. డైపర్ రాష్ మంటను తగ్గించటానికి సహజ నివారణలను ఉపయోగించి ఉత్తమ చికిత్సలను ఎంపిక చేసుకోవాలి. చిన్నపిల్లల్లో డైపర్ రాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో వివిధ రకాల జబ్బులకు దారితీస్తుంది. క్యాన్సర్, రీప్రొడక్టివ్ ప్రొబ్లమ్స్, హార్మోనల్ ప్రొబ్లెమ్స్, వ్యాధినిరోధకత లోపించడం, అలర్జీ రియాక్షన్స్ ను ఎదుర్కోవల్సి ఉంటుంది. పిల్లలకు డైపర్స్ ను ఉపయోగించడం తల్లులకు సులభం కావచ్చు కానీ, పిల్లలకు అది సురక్షితం కాదు. డైపర్స్ వల్ల పిల్లల ఏడుపును తల్లిదండ్రులు గుర్తించలేరు.

అలాగని రోజంతా క్లాత్ తో తయారుచేసే డైపర్లను ఉపయోగించలేము. అలా సాధ్యం కాలేనప్పుడు రెడీ మేడ్ డైపర్స్ ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి డైపర్ బ్రాండ్స్ పిల్లలకు ఇబ్బంది లేదా సమస్యలకు గురి చేస్తున్నాయో వాటి గురించి తెలుసుకోవడం, ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పసిపిల్లలకు టాక్సిక్ డైపర్స్ ను ఉపయోగించడానికి ముందు ఒకటికి రెండు సాలర్లు ఆలోచించాలి. డియోక్సిన్స్, వివోసిస్, ఫ్రాగ్రన్స్, టైబుల్టిల్ టిన్ మరియు సోడియం పోలీక్రైలేట్స్ మరియు మరికొన్ని హానికరమైన కెమికల్స్ ను డైపర్స్ లో కనుగొనడం జరిగింది. మరి బేబీస్ కు డైపర్స్ ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఒక సారి తెలుసుకుందాం…

చర్మం ఎర్రగా మారడం: డైపర్స్ ఉపయోగించేటప్పుడు పిల్లలో ఎక్కువగా గమనించే లక్షణం డైపర్స్ వల్ల బేబీ స్కిన్ రెడ్డిష్ గా మారుతుంది . ఇలా ఎర్రగా మారిన కొద్ది సేపటి తర్వాత దురదు, దద్దుర్లు, మరియు ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి .

స్కిన్ ఇన్ఫెక్షన్స్: బేబీ స్కిన్ చాలా సున్నితంగా ఉండటం వల్ల, చిన్న చిన్న రాషెష్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. బేబీ స్కిన్ రాసుకొన్నప్పడు, దురద మరియు ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్స్ : సాధారణంగా నార్మల్ కాటన్ క్లాత్ డైపర్స్ ను ఉపయోగించేటప్పుడు , తడి అయిన ప్రతి సారి డైపర్స్ ను మార్చాల్సి ఉంటుంది . అయితే డిస్ఫోసబుల్ డైపర్స్ ఎక్కువ సమయం అలాగే ఉంచేయడం వల్ల బేబీస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. అనటోమికల్ పెక్యూలియారిటీ వల్ల ఇది బేబీ గర్ల్స్ లో ఎక్కువగా ఉంటుంది.

అలర్జీ డైపర్స్ లో ఉండే కంటెంట్ వల్ల బేబీ గర్ల్స్ లో అలర్జీకి కారణం. ఇవి ఫ్యూయల్ స్మెల్ కలిగి ఉంటాయి . కాబట్టి డిస్పోసబుల్ డైపర్స్ ను పిల్లలకు ఉపయోగించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను తరచూ గమనింలి .గమనిస్తుండాలి.

వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది : డైపర్స్ లో ఉండే వాలిటిలై ఆర్గానిక్ కాంపౌడ్స్ బేబీ యొక్క ఇమ్యునిటి మీద ప్రభావం చూపుతుంది. తరచూ వ్యాధినిరోధక శక్తి లోపించడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు మరియు ఇన్ఫ్లమేషన్ కు గురి కావల్సి ఉంటుంది . మీ పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటే డైపర్స్ ను గమనించాలి. ఎలాంటి బ్రాండ్ డైపర్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయో గుర్తించాలి.

డైపర్ రాష్: బేబీస్ లో డైపర్ స్కిన్ కు దగ్గరగా ఉండటం మరియు తడి అయినప్పుడు స్కిన్ కు అతుక్కొని ఉండటం వల్ల ఆ ప్రదేశంలో స్కిన్ ఎలాసిటి తగ్గిపోతుంది . ఆ ప్రదేశం రెడ్ గా మారుతుంది మరియు కొన్ని సందర్భాల్లో దద్దుర్లు, గుల్లలు వంటివి ఏర్పడుతాయి . ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ ప్రదేశంలో టచ్ చేస్తే వేడి అనిపిస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్ : అవును, డైపర్స్ వల్ల ఆ ప్రదేశం డ్రైగా మార్చుతుంది. కానీ డైపర్స్ ను ఎక్కువ సమయం కంటిన్యూగా వాడుతుంటే, మాయిశ్చరైజర్ కోల్పోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది . బేబీస్ కు డైపర్స్ ఉపయోగించడం వల్ల కలిగే ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అని గుర్తుంచుకోవాలి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved