మనలో ఎక్కువ మందికి నడుం నొప్పి కలిగించే భాదలను చూస్తుంటాం. కాని కొన్ని జాగ్రత్తలతో నడుము నొప్పిని బాగా నివారించవచ్చు. అవి ఎలాగో చూదాం…!

* వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాల్ని ముందుకు కుంచించడం కాకుండా పొడవుగా శరీరం కిందకు జరపాలి. కడుపు భాగం లోపలికి జరగాలి.

* ఆహార నియమాల్ని పాటిస్తూ శరీరానికి తగ్గ బరువును కలిగి ఉండాలి. ఆహారంలో కొవ్వు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బరువు ఉంటే వెన్ను విూద అధిక ఒత్తిడి కలుగుతుంది.

* నొప్పి బాగా ఉన్నపుడు మర్దనా చేస్తే కండరాలు రిలాక్స్‌ అయి నొప్పిని తగ్గిస్తాయి.

* కుక్కి మంచాల విూద కాకుండా గట్టిగా వుండే మంచం మీద విశ్రమించాలి.

* మంచం విూద పడుకోబోయే ముందు, లేచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఉదుటున కాకుండా నిదానంగా లేవాలి. నిదానంగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తల కింద దిళ్లు మరీ ఎత్తుగా ఉండకూడదు. అలా ఉంటే మెడనొప్పి మొదలవుతుంది.

* వీపు వంపునకు ఊతంగా ఉండే కుర్చీలో కూర్చోవాలి. ఇది ముందుండే డెస్క్ ఎత్తుకు తగ్గట్లు ఉండాలి.

* నడిచేటప్పుడు రిలాక్స్‌గా ఉండాలి. గూనీ పెట్టకుండా, భుజాలను కిందికి జరిపి ఎత్తుగా నడవాలి. పొట్ట లోపలికి ఉండాలి.

* బరువు ఎత్తేటప్పుడు నడుము వంచకూడదు. మోకాళ్లను కూడా… బరువు ఎత్తేటప్పుడు పక్కకు తిరగకూడదు.

తరచూ వచ్చే నడుం నొప్పిని సుమారుగా 90 శాతం వ్యాయామంతో తగ్గించుకోవచ్చు. కానీ.. డాక్టర్ సలహా మేరేక వ్యాయామాలు చేయాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved