'బాహుబలి' చిత్రంలోని కొత్త భాష 'కిలికి'

బాహుబలి చిత్రంలో కాలకేయ అనే కిరాతక సేన నాయకుడు వాడిన విచిత్రమైన భాష ప్రపంచంలో ఎక్కడైనా వుందా ? వుంటే ఎక్కడ వుంది ?

కాలకేయుడు విచిత్రమైన భాషలో తన కౄరత్వాన్ని వెళ్ళగ్రక్కుతూ యుధ్ధరంగంలో మాట్లాడిన మాటలు బాహుబలి ప్రేక్షకుల్ని బాగా పట్టుకున్నాయి. థియేటర్ లోంచి బయటకు వచ్చాక కుర్రకారు ఆ భాషే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంతకీ ఇదేదో అర్ధంపర్ధం లేని భాషలా అనిపిస్తుంది. కాని కాదు. అర్ధం వుంది. నిజానికి అలాంటి భాష ఇదివరకు లేదు. కాని ఇప్పుడు వుంది.

అదే బాహుబలి లోని 'కిలికి ' భాష.

ఇది ఈ చిత్రంకోసమే ప్రత్యేకంగా సృష్టించబడింది. తమిళంలో ఈ చిత్రానికి పాటలు, మాటలు రాసిన మదన్ కార్కి వైరముత్తు ఈ కిలికి భాషని తయారు చేశారు.

"ఆరేళ్ళక్రితం నేను ఆస్ట్రేలియా లో పి హెచ్ డి చెస్తున్న రోజుల్లో పిల్లలకి ట్యూషన్లు చేబుతూ, వివిధ భాషల మధ్య వ్యత్యాసం గురించి కూడా చెప్పే వాణ్ణి. అప్పుడే నాకు కొత్త భాషని ఎలా పుట్టించగలం - అనే అలోచన వచ్చింది " అంటారు కార్కి. ఆయన మాటల్లో చెప్పాలంటే, అప్పుడు ఆయన తయారు చేసిన భాష - క్లిక్. ఓ వంద పదాలతో అది పుట్టింది.

తరువాత రాజమౌళి గారి బాహుబలి కోసం దాన్నే విస్తృతం చేసి, 750 పదాల కొత్త భాషని సృష్టించారు. దీనికి 40 కి పైగా స్పష్టమైన వ్యాకరణ సూత్రాలను కూడా రూపొందించారు.

అందుకే ఇదొక కొత్త భాష, అర్ధవంతమైన భాష.

ఈ కిలికి భాషలో - "మిన్ అంటే నేను, నిం అంటే నువ్వు, బ్రుస్లా అంటే రక్తం .... " ఇలా అనేక కొత్త పదాలతో, ఎలాంటి అక్షరాలను పలకటంలో క్రూరత్వం ధ్వనిస్తుందో అలాంటి అక్షరాలతో దట్టించిన పదాలతో తయారైన భాష

'కిలికి ' బాహుబలి చిత్రం ప్రత్యేకతల్లో ఒకటి

కిలికి బాష ఒక్కసారి చదవండి మీకోసం రాసాము, చదివినాక షేర్ చెయ్యండి అందరికి

Nimmdaa. Gojrass Thelmii..

Asrdha bhos.. Kkraakvikana Bhhumle

Mohinoojukooo.Lioohakvee...

Unu kaastha.peezraa..

RoopuveeMinn..Bahathhee

Zarathraamaa mahashmathee..

Bhreemsaa.. Inknoom..Minmahakki..

Chooho..Chuunnamatasweekdhee..

Thraaa.Ghrakshh. hooorr..Aaarr


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved