శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ లను తగ్గించే అరటిపండు-నీటి మిశ్రమం

అరటిపండు పిల్లలకు చాలా రకాల ప్రయోజనాలను కలుగచేస్తుంది.

అరటిపండు, దగ్గును తగ్గించే అద్భుతమైన సహజ ఔషదంగా చెప్పవచ్చు.

దీనిని పెద్ద వారికి కూడా వినియోగించవచ్చు.

ఇది రుచికరంగానూ, పోషకాలను అందించే ఆరోగ్యకర ఆహార పదార్థంగా చెప్పవచ్చు.

అరటిపండును తినటం వలన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చటమేకాకుండా, అరటిపండు మరియు నీరు కలిపి తయారు చేసిన మిశ్రమం దగ్గు, దీర్ఘకాలిక దగ్గు మరియు బ్రాంకైటీస్ వ్యాధులను తగ్గిస్తుంది.

ఈ మిశ్రమం చిన్నపిల్లలలో చాలా శక్తివంతంగా అని చేస్తుంది దీనిని పెద్ద వారికి కూడా వాడవచ్చు. ఈ విధంగా తయారు చేసిన అరటిపండు క్రీమ్ ఆరోగ్యకరమైనది, రుచికరమైనది మరియు పోషకాలతో పాటూ, పొట్టలో సంబంధిత సమస్యలను కూడా తగ్గించి వేస్తుంది. మీ పిల్లలు గొంతు సమస్యలు మరియు దగ్గుతో భాదపడుతూ ఉంటే, అరటిపండుకు నీటిని కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఇవ్వవచ్చు.


అరటిపండు క్రీమ్ రెసిపీ తయారు చేసే విధానం

రెండు పండిన అరటిపండ్లను తీసుకోండి.

రెండు చెంచాల చక్కెర లేదా తేనె కలపండి (తేనె కలిపితే కలపాలి అనుకుంటే మిశ్రమం చల్లబరచిన తరువాత కలపండి ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద తేనె తన అమోఘమైన గుణాలను కోల్పోతుంది).

400 మిల్లిలీటర్ల వేడి నీటిని కలపండి.


తయారీ విధానం

మీరు తీసుకున్న అరటిపండు తొక్కను తీసేసి, దంచండి. తరువాత, దీనికి చక్కెర కలిపి బాగా కలపండి. వేడి నీటిని ఈ మిశ్రమానికి కలిపి, 30 నిమిషాల వరకు అలాగే వేచి ఉండండి. ఒకవేళ తేనెను కలపాలి అనుకుంటే, మిశ్రమం చల్లబరచిన తరువాత కలపండి.


ఎలా తీసుకోవటం?

ఈ సహజ ఔషదాన్ని తీసుకోవటానికి ముందుగా, కొద్దిగా మిశ్రమాన్ని వేడి చేసి, రోజులో (100మిల్లిలీటర్లు) 4 దఫాలుగా తాగండి. దగ్గు, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ మరియు ఇతరేతర జీర్ణాశయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుటకు గానూ, ఈ మిశ్రమాన్ని రోజు వాడటం వలన కొద్ది రోజులలోనే ఎలాంటి ఖరీదైన అల్లోపతి మందులను వాడకుండానే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  

అరటిపండు, తక్కువ స్థాయిలో గ్లిసెరిన్ మరియు మృదువుగా ఉండే, సులభంగా తినగలిగే సహజ పండుగా చెప్పవచ్చు. అంతేకాకుండా, పొటాషియం, విటమిన్ 'C', మరియు 'B6' వంటి పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది.


ఇంట్లో ఉండే ఔషదాల గురించి మరింత సమాచారం కోసం


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved