రోజుకు ఒక్క అరటిపండు తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పు..

అరటి పండ్లు హెల్తీ ఫ్రూట్ అంతే కాదు, హెవీ న్యూట్రీషియన్స్ కలి ఉన్న ఫ్రూట్ కూడా....దీన్ని తినకుండా ఉండటానికి ఎలాంటి రీజన్స్ లేవు. అయితే చాలా మంది అరటి పండ్లు తినడం వల్ల లావైపోతామని, లేదా డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నమ్మతుంటారు.

అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగినట్లు ఎక్కడా, ఏ పరిశోధనల్లో ఎలాంటి రుజువులు, నిర్ధారణలు, ఆధారాలు లేవు . నిజానికి అరటి పండ్లు బరువు తగ్గిస్తాయి . బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి . ఎవరైతే అరటిపండ్లు తినకుండా ఉంటారో వారిలో వివిధ కారణాలుంటాయి, కానీ వారు కూడా నిసందేహంగా అరటి పండ్లను తీసుకోవచ్చు. ఆ హెల్తీ ఫ్రూట్ గా బనానాను తినకుండా మాత్రం ఉండకూడదు.

అరటిపండులో ఉండే విటమిన్స్ హ్యాపి బ్రెయిన్ కెమికల్స్, సెరోటినిన్ సంతోషంగా ఉండనిచ్చే కెమికల్స్ ను బ్రెయిన్ లో పెంచుతుంది. కాబట్టి అరటిపండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యకరం, సంతోషపెట్టడానికి, నందానికి నిలయం .అంతే కాదు, అరటిపండ్లు బాగా నిద్రపట్టడానికి మరియు మనలోని కోపాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు గ్యాస్ ట్రబుల్స్ ను నివారిస్తాయి

ఫ్యాట్ బర్నింగ్ అవ్వడం ప్రారంభమౌతుంది:

అరటిపండు9లో కోలిన్ మరియు బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది . ఇది బెల్లీలో మరియు బాడీలో ఫ్యాట్ నిల్వచేరకుండా నివారిస్తుంది.ఈ విటమిన్స్ నేరుగా జీన్స్ మీద ప్రభావం చూపి, శరీరంలో ఫ్యాట్ ఏర్పడకుండా చేస్తుంది.

గ్యాస్ మరియు బ్లోటింట్ సమస్యలుండవు:

ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి లేదా రెండు అరటింపడ్లు తినడం వల్ల 50శాతం గ్యాస్ మరియు బ్లోటింగ్ సమస్యలు నివారించబడుతుంది . అరటిపండ్లు పొట్టలోని పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియా గ్యాస్ మరియు బ్లోటింగ్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

డయాబెటిస్ తో పోరాడుతుంది:

అరటి పండ్లు తినడం వల్ల మన తీసుకొనే ఆహారాల ద్వారా పొందే షుగర్స్ ను శరీరం గ్రహించకుండా మరియు పేగుల్లోని రక్తం తో చేరకుండా నివారిస్తుంది . అరిటిపండ్లలో ఉండే ప్రోటీన్లు మరియు మంచి ఫ్యాట్స్ డయాబెటిస్ ను నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సంతోషంగా ఉంటారు:

అవును, అరటిపండ్లు తినడం వల్ల తక్షణం సంతోషంగా ఫీలవుతారు , ఇందులో ఉండే ఫొల్లెట్ , యాంటీ ఆక్సైటీ మరియు యాంటీడిప్రెజంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ బ్రెయిన్ కెమికల్స్ సెరోటినిన్ మూడ్ ను మార్చే కెమికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.

కండరాల సలుపు మరియు కండరాల నొప్పులను నివారిస్తుంది:

వర్కౌట్స్ తర్వాత మజిల్స్ సలపడం లేదా నొప్పి గా ఉండటం సహజం. అలాంటి సమయంలో అరటిపండ్లు తినడం వల్ల ఇది నొప్పులను తగ్గిస్తుంది . ఇది అరటిపండ్లు పొటాసియం కలిగి ఉండటం వల్ల ఇది కండరాలను బలోపేతం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

బెటర్ స్లీప్:

అరటిపండ్లలో అమినో యాసిడ్స్ , ట్రైప్టోఫోన్ ఇది మెలటోనిన్ ఫార్మేషన్ కు సహాయపడుతుంది. ఇది నిద్రకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ హార్మోన్ మిమ్మల్ని కామ్ గా మరియు రిలాక్స్ పరుస్తుంది . దాంతో మంచి నిద్రపొందుతారు.

అనారోగ్యకరమైన ఆహారాల మీద కోరిక కలిగించదు:

మీరు షుగర్ ఫుడ్స్ మరియు హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మీద కోరికలున్నప్పడు అరటిపండ్లు తినడం వల్ల , అలాంటి అనారోగ్యకరమైన ఆహారపు కోరికలను తగ్గిస్తుంది .


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved