బైక్ రేసింగ్ లో రేసర్లంతా దుర్మరణం.. బయటికి వచ్చిన సంచలన వీడియో

అత్యాధునిక బైకులతో రేసింగులకు వెళ్లడం భారత్ లోని ప్రధాన పట్టణాల్లో అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బెంగళూరులో భయంకరమైన బైక్ రేసింగ్ లో రేసర్లంతా దుర్మరణం పాలవ్వడం ఆందోళన కలిగించింది. అర్ధరాత్రి సరికొత్త అత్యాధునిక బైకులతో నలుగురు యువకులు బెంగళూరులోని ఎయిర్ పోర్టు రోడ్డు ఎక్కగా.. రేసింగ్ ప్రారంభమైన మరుక్షణం నలుగురు రేసర్లు రయ్ మంటూ దూసుకుపోయారు. మరికాసేపట్లో గమ్యం చేరుకుంటారనగా, వీరిని అనుసరిస్తూ వీడియో తీస్తున్న కారును ఓ రేసర్ ఢీ కొట్టాడు.

దానితో వెనుకే వసున్న మిగిలిన ముగ్గురు ఒకరికొకరు రోడ్డును బలంగా ఢీ కొట్టడంతో, రోడ్డుపై బైకులతోపాటు ఈడ్చుకుపోయారు. వీడియో తీస్తున్న వారు కారు దిగి చూసేటప్పటికే నలుగురు రేసర్లు చనిపోయారు. వీరిలో ఎవరూ హెల్మెట్లు ధరించకపోవడం తో ఈ ఘోరం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే రహదారిని ఎంచుకుని రేసింగ్ మొదలు పెట్టడం.. రేసింగ్ లో ట్రైనింగ్ లేకపోవడం వంటి సాంకేతిక కారణాలు వీరి దుర్మరణానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved