ముఖంపై ముడతల నివారణకు ఇంటి చిట్కాలు!

మన తీసుకునే ఆహార పదార్థాలలో విటమిన్లలోపం వుండటం వల్ల, పోషక పదార్థాలు లభించకపోవడం వల్ల, తక్కువగా నిద్రపోవడం వల్ల చిన్న వయస్సు నుంచే ముఖంపై ముడతలు ఏర్పడటం మొదలవుతాయి. ఫలితంగా ముఖంపై చర్మం ముడతలుగా మారి, వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.

అటువంటి సమయంలో చాలా తక్కువ ఖర్చుతో మీరు మీ ఇళ్లల్లోనే సులభంగా మీ చర్మాన్ని ప్రకాశవంతంగాను, ముఖంపై వున్న ముడతలను నివారించుకోవచ్చు. మరి ఆచిట్కాలేమిటో తెలుసుకుందామా..

ముఖంపై ముడతలను నివారించే చిట్కాలు :

రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు బంగాళదుంపతో తయారుచేసుకున్న గుజ్జును ముఖానికి పట్టించుకోవాలి. అది బాగా ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ప్రతిరోజూ రెండువారాలపాటు చేసుకుంటే చాలు... ముడతలను నివారించుకోవచ్చు. అరటిపళ్లతో తయారుచేసిన గుజ్జును కూడా ప్రతిరోజూ ముఖానికి రాసుకుని... బాగా ఆరేంతవరకు వేచి వుండాలి. తరువాత చల్లటి నీళ్లలో కడిగి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా త్వరగా మంచి ఫలితం లభిస్తుంది.

క్యారెట్ తో తయారుచేసుకున్న జ్యూస్ లో పాలు కలుపుకోండి. అందులో బాదం పలుకుల పొడిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖంపై మృదువుగా మర్దనా చేసుకుంటే.. మంచి ఫలితం దక్కుతుంది.

ప్రతిరోజూ బాదం నూనె ముఖానికి పూసుకుని మర్దనా చేసుకోవడం వల్ల కూడా ముఖంపై వున్న ముడతలను నివారించుకోవచ్చు.

కోడిగుడ్డులో వుండే తెల్లసొనలో నిమ్మిరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకు తగలకుండా జాగ్రత్తగా ముఖానికి పట్టించుకోవాలి. ఇలా కొద్దిసేపు వుంచుకున్న తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో చర్మం చాలా మృదువుగా, సాఫ్ట్ గా తయారయి.. ముడుతలను మటుమాయమైపోతాయి.

బీట్ రూస్ రసంను ప్రతిరోజూ ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున తీసుకోవడంవల్ల నిత్యం యవ్వనంగా కనిపించవచ్చు. ఫలితంగా ముఖంపై ముడతలు ఏర్పడవు.

ముఖంపై ముడతలు ఎక్కువగా కనిపిస్తే... కొంచెం క్యాబేజి జ్యూస్ తీసుకుని, అందులో ఒక టీ స్పూన్ తేనె జతచేసి ముఖానికి పట్టించుకోవాలి. అలా కొద్దిసేపు ఎండిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో ముడతలు క్రమక్రమంగా తగ్గడం ప్రారంభం అవుతాయి.

తాజాగా తీసుకున్న ఒక బొప్పాయి పండును గుజ్జుగా తయారుచేసుకుని ఐదు నిముషాలపాటు ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటసేపు ఆగిన తరువాత గోరువెచ్చని నీరుతో కడుక్కుని, పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే ముఖంపై ముడతలు రాకుండా నివారించుకోవచ్చు. బొప్పాయి పండును ప్రతిరోజు తినడంవల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది.

ఈ విధంగా ఏదైనా ఒక చిట్కాను ప్రతిరోజు తప్పకుండా పాటిస్తే.. మీ చర్మంపై వున్న ముడతలతో సహా మొటిమలను రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved