బీరు క్యాన్‌తో వైఫై సిగ్నల్ బూస్టర్..!

ఆధునిక టెక్నాలజీ సేవలను వినియోగించుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అతి ముఖ్యమైన సమాచారం కోసం వైఫైని ఉపయోగించుకుంటూ ఉండగా సిగ్నల్ అర్ధాంతరంగా ఆగిపోయిందనుకోండి. ఎక్కడ లేని కోపం ముంచుకొస్తుంది. వైఫై సిగ్నల్స్‌కు బూస్టర్లు ఉన్నాయంటూ చాలా మంది చెప్తూ ఉంటారు. సొమ్ము ఖర్చుపెట్టి వాటిని తీసుకొచ్చినా అప్పుడప్పుడూ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మరింత ఆవేదన కలుగుతుంది. ఇటుపైన అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో వైఫై సిగ్నల్ బూస్టర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారుచేయాలో ఈ వీడియోను చూడండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీకు కావలసింది ఖాళీ బీరు బాటిల్ లేదా సోడా క్యాన్! ఇవి ఉంటే చాలు మీ వైఫై సిగ్నల్ ఝామ్మంటూ దూసుకెళ్తుందని అంటున్నారు. (వీడియో సౌజన్యం - కిప్కే)


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved