బెర్రీలు తినండి.బరువు తగ్గండి.

మధ్యాహ్నం లంచ్‌కీ, రాత్రి డిన్నర్‌కీ మధ్య గుప్పెడు బెర్రీ పళ్ళు తింటే చాలు బరువు తగ్గుతారని అంటున్నారు లండన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. సాయం సమయంలో ఇతర స్నాక్‌లకు బదులు బెర్రీ పళ్ళు తింటే వారంలో సుమారు వెయ్యి క్యాలరీలు తగ్గే అవకాశం ఉందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. పన్నెండు మంది ఊబ కాయుల మీద సుమారు మూడు వారాల పాటు పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వీరు స్పష్టం చేస్తున్నారు. బెర్రీ పళ్ళు తినడంతోనే ఆగిపోకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మరింత మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చని వీరు అంటున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved