నకిలీ మందులున్నాయ్ జాగ్రత్త..

దేశ వ్యాప్తంగా బోగస్ మెడిసిన్స్ మెడికల్ షాప్స్ లో దర్శనమిస్తున్నాయి. నకిలీ మందులు ప్రజల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. అసలైన ఔషధాల్లాగా వీటిని పారిశ్రామికవాడల్లో నకిలీ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నట్టు యాంటీ-నార్కోటిక్ ఏజెన్సీలు జరిపిన దాడుల్లో వెల్లడైంది. తమను ఒరిజినల్ ఫార్మసిటికల్ యూనిట్లుగా చెప్పుకుంటూ లోపల మాత్రం ఇవి ఈ దందా కొనసాగిస్తున్నాయట.. పూర్తి స్థాయి ఫ్యాక్టరీలుగా ఈ యూనిట్లు సాగిస్తున్న ఇల్లీగల్ యవ్వారమిది. తక్కువ ఖర్చుతో, మార్కెట్ లోకి సులభంగా ఎంటరవుతున్న మందుల్లో మెఫోడ్రోన్, కెటామైన్ వంటివి ఉన్నాయి.

ఇటీవల జరిగిన దాడుల్లో ఢిల్లీ సమీపం లోని భివాడీ లోగల ఓ యూనిట్ నుంచి 500 కేజీల మెఫోడ్రోన్ ను, మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి 1200 కేజీల కెటామైన్ ను, హైదరాబాద్ జీడిమెట్లలోని ఫ్యాక్టరీ నుంచి 121 కేజీల అల్ ప్రా జోలమ్ ను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ దందాగాళ్ళంతా ఓ సిండికేట్ గా ఏర్పడి నకిలీ మందులను ఉత్పత్తి చేస్తున్నారు. గత కొన్నేళ్లలో ఇది మరింతగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులే చెబుతున్నారు. మార్కెట్లలో కోట్లాది రూపాయల బిజినెస్ ఇలా సాగుతోందట..గుజరాత్ లో అవాస్టిన్ అనే మందును వాడిన కంటి రోగుల్లో కొందరికి కంటి చూపు తగ్గినట్టు ఆరోపణలు రావడంతో అక్కడ ఈ మందు అమ్మకాలు నిలిపివేశారు. దాంతో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని మార్కెట్లలో ఉన్న ఈ మందు విక్రయాలు నిలిపివేసినట్టు తెలిసింది.

స్విట్జర్లాండ్ కు చెందిన రోష్ అనే సంస్థ ఈ మెడిసిన్ ను మన దేశానికి ఎగుమతి చేస్తుండగా దీన్ని దిగుమతి చేసుకున్న సంస్థలు మెడికల్ షాపులకు అమ్మకుండా నేరుగా ఆసుపత్రులకే సప్లయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ అక్రమ బాగోతం ఎలా మొదలవుతుంది..? ఓ పారిశ్రామిక వాడలో ఒక ఫ్యాక్టరీ యూనిట్ ను డ్రగ్ సిండికేట్స్ అద్దెకు గానీ, లీజుకు గానీ తీసుకుంటాయి. ఆ తర్వాత కెమిస్టులను, సిబ్బందిని నియమించు కుంటాయి.. అసలైన, ఒరిజినల్ మందులు తయారు చేస్తున్నామని చెప్పుకుంటూ ప్రభుత్వాల నుంచి లైసెన్స్ పొందుతాయి.

ఆ తర్వాత తక్కువ ఖర్చుతో నకిలీ మందులను తయారు చేస్తూ వాటిమీద ఒరిజినల్ కంపెనీల బ్రాండ్ల స్టికర్లను, లేబుల్స్ ను అంటించి మార్కెట్లలోకి విడుదల చేస్తాయి. అయితే వీటిపై నామమాత్రపు దాడులు జరుగుతుండడంతో వీటి యవ్వారం యధేచ్చగా సాగిపోతోంది. ప్రభుత్వాల, లేదా అధికార యంత్రాంగాల నిఘా వైఫల్యం కూడా ఈ బోగస్ యూనిట్ల దందా పెరగడానికి కారణమవుతోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved