మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రకృతి అందాలలో ఓకటి భైరవకోన షేర్ చేసి తోటి తెలుగు మిత్రులకు తెలియచేయండి..

9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖర పురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. భైరవకోన అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ఎత్తయిన జలపాతం. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ యాత్రికులకు కనువిందు చేస్తోందీ జలపాతం. జలపాతం నుంచి కింద పడి నీరు సోనవాన పేరుతో దుర్గాంబ, భైరవాలయాల మధ్య ప్రవహిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని కాంతి కిరణాలు సెలయేటి నీటిపై పడి దుర్గా దేవిపై ప్రసరిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి. కోనకు ఎలా వెళ్లాలంటే... భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved