చర్మ వ్యాధులకు కాకర…

కాకరకాయ కూర అంటే మనలో చాలా మందిమి చేదు అని దాని జోలికి పోము. కానీ కాకర మధుమేహం వచ్చిన వారికి చాలా మంచిది. యాంటి బయోటిక్‌ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. కాకరలో తేమ శాతం 92.4 ఉంటుంది. ప్రోటీన్లు 1.6 శాతం, ఖనిజాలు 0.8 శాతం ఉంటాయి. ఇంకా కాకరలో కొవ్వు 0.2 శాతం, పీచు పదార్థం 0.8 శాతం, పిండి పదార్థాలు 4.2 శాతం, క్యాల్షియం 50 మిల్లీ గ్రాములు, సి విటమిన్‌ 96 మిల్లీ గ్రాములు, ఐరన్‌ 9.4 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్‌ 140 మిల్లీ గ్రాములు చొప్పున లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాకరను వారానికి రెండుసార్లయినా ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా అతిసారం, మధుమేహం, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు కాకరకాయలు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved