కెనడా ఒకరోజు ప్రధానిగా ఎన్ఆర్ఐ టీనేజర్

కలలు కనండి… వాటిని సాధించేందుకు శ్రమించండి… అని పెద్దలు చెబుతూ ఉంటారు. కొన్ని కలలు సాకారమవడం చాలా కష్టం. అయితే మనసు తెలుసుకున్నవారు, మానవత్వంతో సహకరిస్తే అసాధ్యాలు కూడా నిజ జీవితంలో అనుభవంలోకి వస్తాయి. కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ప్రభుజోత్ లఖన్పల్ (19) కూడా అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కానీ అతనిని కేన్సర్ ఆవహించింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆయన కలలను ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రెడ్యూ తెలుసుకున్నారు. ప్రభుజోత్‌కు ఒక రోజు ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలనే కల బలంగా ఉందని గుర్తించారు. ఆ కల నిజం కావడానికి జస్టిన్ సహకరించారు. గత బుధవారం ప్రభుజోత్‌ను కెనడాకు ఒక రోజు ప్రధానిగా గౌరవించారు. ప్రభుజోత్‌ను పార్లమెంట్ మిల్ సాదరంగా ఆహ్వానించింది. ఆ బాలుడు వస్తున్నపుడు హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులంతా లేచి నిల్చుని గౌరవించారు. అనంతరం ప్రధాన మంత్రి జస్టిన్‌తోనూ, కెనడా అగ్ర నేతలతోనూ ప్రభుజోత్ ఆ రోజంతా గడిపాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved