కాన్సర్ ఇది వింటేనే చాల మందికి బయం పుడుతుంది....దేశ వ్యాప్తంగా 2014 లో 5 లక్షల కాన్సర్ వ్యాధి మరణాలు

భారతదేశంలో కాన్సర్ వ్యాధి కారణంగా ప్రతి రోజు 1,300 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 లో వ్యాధి బారినపడి దాదాపు 5 లక్షల మంది చనిపోగా, 2013 లో ఆ సంఖ్యా 4,70,000. 2012 లో 4,65,000 గా వుంది. 2012-14 మధ్య కాలం లో కాన్సర్ వ్యాధి వల్ల మరనిచిన వారు 6% పెరిగారు 2013 లో మొత్తం కేసులు 29,34,314 వుండగా, 2012 లో కాన్సర్ బారిన పడిన వారి సంఖ్య 30,16,628 గా నమోదైంది. అంటే కేసులు తగ్గినా మరణాల శాతం పెరిగిందని కాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రంమ్ లో బాగంగా భారత పరిశోదన వైద్య మండలి నిర్వహించిన తాజా అధ్యయనంలో తెలిసింది.

భారత దేశంలో మహిళల మరణాలకు కారణమవుతున్న కాన్సర్ల తో బ్రెస్ట్ (రొమ్ము) కాన్సర్ ముందు నిలిచింది, దిన్ని మనం ముందు గానే తెల్సుకుని డాక్టర్ ట్రీట్మెంట్ తెసుకుంటే 90% వరకు కంట్రోల్ చెయ్యవచు సో ఎలాంటివి విషాలు నేగ్లేట్ చెయ్యకుండా వెంటనే డాక్టర్ చేకుప్ చేసుకుంటే వ్యాధి నివారణ ఈజీ గా వుంటుంది.....

మన ఆరోగ్యాన్ని రక్షించే వైద్యపరీక్షలు

ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూక్తి మనం నిత్యమూ పాటిస్తూ ఉండాలి . మన ఆరోగ్యము గురించి మనము తెలుసుకోలేము . అందుకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను . ఏ రకమైన అనారోగ్యమూ లేదు . . . నాకెందుకు వైద్యపరీక్షలు ... అనుకునేవారు చాలామంది ఉన్నారు . మన అంతర్గత ఆరోగ్యము గురించి ఒక్కొక్కప్పుడు అంత త్వరగా బయటికి తెలియకపోవచ్చు . పూర్వకాలములో కొంత పెద్ద వయసులో వచ్చే బి.పి. , సుగరు లంటి కొన్ని రోగాలు ఇప్పుడు చాలా తొందరగా చిన్న వయసులోనే బయటపడుతున్నాయి . అందువల్ల సరైన సమయమ్లో తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల పరిస్థితి చేజారిపోకుండా కాపాడుకోవచ్చును.

చర్మ కాన్సర్‌ పరీక్ష

స్త్రీలలో సెర్వైకల్ కాన్సర్ ను ముందుగా పసిగట్టే పరీక్ష ఇది . చాలా సింపుల్ గా చేయవచ్చును . ... ఈ పరీక్ష ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎలా వుంది, ఎనీమియా ఏమైనా వుందా లాంటిది తెలుస్తుంది.

ప్రతిరోజూ శరీరం మొత్తాన్నిగమనించాలి. చర్మంపై ఎక్కడన్నా మార్పు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. స్కిన్‌ కాన్సర్‌ లాంటిదేమైనా వుంటే తక్షణం చికిత్స పొందాలి. కుటుంబంలో ఎవరికయినా చర్మ కాన్సర్‌ ఉన్నట్లయితే ప్రతి మూడేళ్ళకోసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి

రక్తపోటు పరీక్ష

సామాన్యంగా ఏ డాక్టర్‌ దగ్గరికెళ్ళినా బీపీ పరీక్షిస్తారు. లో బీపీ, హై బీపీ.. ఏది ఉన్నా కష్టమే. బ్లడ్‌ ప్రెషర్‌ ఉందని తెలిసినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

రొమ్ము పరీక్ష

రొమ్ము భాగంలో ఏదైనా గడ్డ ఉన్నట్లనిపిస్తే ఆలస్యం చేయకుండా నివృత్తి చేసుకోవడం మంచిది. బ్రెస్ట్‌ కాన్సర్‌లాంటి ప్రమాదమేదైనా పొంచి వుందేమో ఒకసారి బయాప్సీ చేయించుకోవాలి. అలాంటిదేమీ లేకపోతే ఆనందమే కదా. ఒకవేళ కాన్సరైతే తొలిదశలోనే చికిత్స పొందితే తగ్గిపోతుంది.

బ్లడ్ గ్రూప్ టెస్స్ట్ :

ప్రతి మనిషి నేటి సమాజం లో ప్రమాదాలకు గురవుతూఉంటారు . అత్యవసరం గా బ్లడ్ ఎక్కించవలసి వస్తే బ్లడ్ గూప్ ముందుగా తెలిస్తే త్వరగా ట్రీట్ మెంట్ జరిగేందుకు అవకాశము ఉంటుంది .Rh నెగటివా ? పొజిటివా తెలుస్తుంది .

HIV టెస్ట్ :

వయసులో ఉన్న ఆడ మగ చేసే పొరపాట్లు వలన కొన్ని ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశాలు మిండుగా ఉన్న ఈ రోజుల్లో ముందు జాగ్రత్త గా ఈ పరీక్షలు చేసుకోవడం మంచిది .

దయచేసి అందరికి ఇ విషయం తెలియాలి ప్లీజ్ షేర్ చేయండి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved