చికెన్ ప్రియులకు షాక్.. బ్యాన్ చేసిన సౌదీ

భారత్ నుంచి కోళ్లు, చికెన్, గుడ్ల దిగుమతులను సౌదీ అరేబియా నిలిపివేసింది. దేశంలో చికెన్ గున్యా వ్యాధిగ్రస్తులు పెరిగిపోతుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చికెన్, గుడ్లను తాత్కాలికంగా నిలుపదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన లేఖను సోమవారం ఎన్విరాన్‌మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చరల్ శాఖ విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రతీ మూడు నెలలకు ఓ సారి పరిశీలిస్తామని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయంలో మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు కూడా చికెన్, గుడ్లు వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం సూచించింది.

ప్రభుత్వ సూచనతో చికెన్ ప్రియులకు ఓ వైపు కడుపుమండినా.. ఆరోగ్యం కోసమే కనుక తప్పడంలేదంటూ పలువురు వ్యాఖ్యానించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సౌదీకి 92.53 మిలియన్ డాలర్ల విలువగల ఫౌల్ట్రీ ఉత్పత్తులను సౌదీకి భారత్ ఎగుమతి చేసింది. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఇది కాస్తా 117.40 మిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసింది. భారత్‌ నుంచి ఫౌల్ట్రీని దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశం సౌదీ అరేబియా కావడం విశేషం. ప్రస్తుతం వీటిపై నిషేధం విధించడంతో పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved