చాక్లెట్ లతో దగ్గు మాయం!

చాక్లెట్ ప్రియులకు ఆనందాన్ని కలిగించే శుభవార్తను హుల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అలైన్ మొరిస్ అందించారు. అంతర్జాతీయ దగ్గు నిపుణుడుగా పనిచేస్తున్న ఆయన దగ్గు ఉపశమనానికి చాక్లెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అనేక పరిశోధనల తర్వాతే ఈ విషయాన్ని దృవీకరించామని తెలిపిన ఆయన 163 మంది వ్యక్తులకు సుమారు ఒక ఏడాది పాటు క్రమం తప్పకుండా చాక్లెట్లు తినిపించామని తెలిపారు. చాక్లెట్ తినడం కారణంగా దగ్గుకు సంబంధించిన లక్షణాలు వారిలో కనిపించలేదన్న విషయం తమ పరిశోధనలో తేలిందని అలైన్ అభిప్రాయపడ్డారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved