ఇస్త్రీ హిస్టరీ

బయటికి వెళ్లాలనగానే ఇస్త్రీ బట్టల కోసం చూస్తాం. ఇస్త్రీ అనేది.. ఒకటో శతాబ్దంలోనే పెద్దపెద్ద ఇనుప గిన్నెలాంటి పరికరంలో మండే బొగ్గును వేసి బట్టను సాఫీ చేయడానికి వాడేవారట. ఆ తర్వాతి కాలంలో ఇనుప పెట్టెలాంటిది వాడుకలోకి వచ్చింది. 5వ శతాబ్దంలో గ్రీకులు ఇస్త్రీ పెట్టెలను మొదటిసారిగా ఉపయోగించారని చరిత్ర చెబుతోంది. మన దేశంలో కేరళీయులు. ఆ కాలంలో బొగ్గుకు బదులు కొబ్బరిచిప్పల్ని వాడేవారు. ఆ తర్వాత కిరోసిన్, గ్యాస్ లాంటి వివిధ ఇంధనాలతో ఇనుపపెట్టెను వేడెక్కేలా చేసి ఇస్త్రీ చేసేవారు. క్రమేణా విద్యుత్తుతో పనిచేసేవి వాడుకలోని వచ్చాయి. అవసరమైన ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెను 1882లో హెన్రీసీలె కనుగొన్నాడు. 1920ల్లో థర్మోస్టాట్తో పనిచేసేవి. ఆ తర్వాత థామస్ సియర్స్ ఆవిరితో ఇస్త్రీ చేసే సౌకర్యాన్ని కనుగొన్నాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved