కిడ్నీ రాకెట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు

అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీ రాకెట్‌ ఒక్కో ఆపరేషన్‌కు 27 లక్షల ప్యాకేజీ కొలంబోలోని ఆస్పత్రుల్లో కిడ్నీ సేకరణ ఆస్పత్రులకు ఫీజు కింద 13 లక్షలు కిడ్నీ ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఏజెంట్లకు కమీషన్‌ రూ.50 వేలు ప్రధాన నిందితుడి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన ఎస్పీ దుగ్గల్‌

ల్లగొండ కిడ్నీ రాకెట్‌ వ్యవహారం ‘సరిహద్దు’లు దాటిపోయింది! తీగ లాగితే డొంక కదిలి అంతర్జాతీయ స్థాయిలో దందా సాగుతోంది! ఒక్కో ఆపరేషన్‌కు రూ.27 లక్షల ప్యాకేజీ! చేసేవారికి 13 లక్షలు.. చేయించుకున్న వారికి ఐదు లక్షలు! ఇదీ కిడ్నీ రాకెట్‌ వ్యవహారం. బుధవారం అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాకు చెందిన కస్పరాజు సురేశ్‌, నల్లగొండకే చెం దిన ఎండీ అబ్దుల్‌ హఫీజ్‌, నిడమనూరు మం డలం రాజన్నగూడెంకు చెందిన పాలెం మహేశ్‌, చిట్యాలకు చెందిన కొత్తపల్లి నరేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారంతా కూడా కిడ్నీలను అమ్ముకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి మూడు పాస్‌పోర్టులు, సెల్‌ఫోన్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లతోపాటు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ వెల్లడించారు. కిడ్నీ దందాకు సంబంధించి నాలుగు రోజుల క్రితమే ఏజెంటును అరెస్టు చేసిన సంగతి తెలిసిం దే. నల్లగొండ దుప్పలపల్లిరోడ్‌లోని కృష్ణవేణి కాలనీకి చెందిన కస్పరాజు సురేశ్‌.. కిడ్నీ అమ్ముకుని స్వ యంగా తానే ఏజెంటు అవతారం ఎత్తాడు. తన మిత్రులు, డబ్బు అవసరం ఉన్న వారిని కూడా ఇందులోకి లాగాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఐ నీడ్‌ కిడ్నీ అనే పేజీని చూసిన సురేశ్‌.. డిసెంబరులో శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి 5 లక్షలకు కిడ్నీ అమ్ముకున్నాడు. తర్వాత తానే ఏజెంటుగా మారిన సురేశ్‌.. డబ్బు ఎరగా చూపి ఇతరులనూ దందాలోకి దింపాడు. దాదాపు 15 మంది కి డ్నీలు అమ్ముకుని అతడికి బాధితులుగా మిగిలారు. అందులో జిల్లాకు చెందిన వారు నలుగురు కాగా.. నలుగురు చొప్పున హైదరాబాద్‌, బెంగళూ రు వాసులు, ఇద్దరు తమిళనాడు వాసులు, ము ంబై, ఢిల్లీకి చెందిన వారు ఒక్కొక్కరు కిడ్నీలు అమ్ముకున్నారు.

కొలంబోలో శస్త్రచికిత్స

అమయాకులను ఎరవేసి విజిటింగ్ విసా పేరిట కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్‌తో పాటు జిల్లా కేంద్రానికికే చెందిన మరో ముగ్గురు ఎం.డీ. అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద 3 పాస్‌పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved