మిత్రులారా, అందరికీ షేర్ చేయండి.

హైదరాబాద్ లో జరిగిన సంఘటన

సైబర్‌ నేరగాళ్ళ కొత్త ఎత్తుగడ

ఏదో ఒక బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని, మీ బ్యాంక్‌ ఖాతాను అప్‌డేట్‌ చేయాలని... ఇలా రకరకాల కథలు చెప్పి ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్‌తోపాటు, వెనుక వైపు ఉన్న సీవీవీ కోడ్‌, పిన్‌ కోడ్‌ తెలుసుకుంటున్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న వెంటనే సంబంధిత బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లి నకిలీ ఏటీఎం కార్డులతో ఖాతాలో ఉన్న మొత్తాన్ని లాగేస్తున్నారు. ఆ తర్వాత వారు ఫోన్‌ చేసిన ఫేక్ ఐడీ తో పెట్టుకున్న నంబర్‌ను సెల్‌ నుంచి తీసి పక్కన పడేస్తున్నారు.

హైదరాబాద్ లో పదవీవిరమణ చేసిన ఒక ఉద్యోగి ఇంటికి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేశారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది.ఆయన భార్య కూడా తపాలా శాఖలో ఉద్యోగి. వారిద్దరికీ ఎస్‌బీఐ లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ''మేము ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డును అప్‌డేట్‌ చేయాలి. దానిపై ఉన్న వివరాలన్నీ చెప్పండి పిన్‌ కోడ్‌తో సహా'' అని హిందీలో మాట్లాడారు. బ్యాంకు నుండి ఫోను చేసారు కదా అని మోసపోయి, ఆమె అన్ని వివరాలూ వెను వెంటనే చెప్పేసింది. రెండు రోజుల తర్వాత ఆమె ఖాతా నుంచి 18వేల రూపాయలు డ్రా చేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లింది. ఆమె మోసపోయినట్లు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిత్రులారా....... ఈ విషయాన్ని మీ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేయండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved