HEALTH “సైక్లింగ్” తో సూపర్ హెల్త్ బెన్ఫిట్స్

ఒకప్పుడు ఇంట్లో సైకిల్ ఉందంటే గొప్ప.…. మరి ఇప్పుడు కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే బైక్. సైకిల్ పై ఎక్కడికైనా వెళ్లాలంటే పెద్దలకు ఏదో ఫీలింగ్. కేవలం చిన్నారులు మాత్రమే తొక్కుతూ ఎంజాయ్ చేయే ఆట వస్తువైపోయింది. పెద్దల ఫీలింగ్ ఫలితంగా అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే సైక్లింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు.

  • సైక్లింగ్ చేసేటప్పుడు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గట్టిగా శ్వాస తీసుకోవడం, వదలడం ద్వారా బాడీలోని టాక్సిన్స్ పోవడంతో పాటు శ్వాస ప్రక్రియ సజావుగా సాగుతుంది. తద్వారా  గుండె పదిలంగా ఉంటుందని అంటున్నారు. 
  • సైక్లింగ్ చేయడం వల్ల  కొలెస్ట్రాల్ తగ్గుతుంది తద్వారా బరువు త్వరగా తగ్గవచ్చు. అంతేగాకుండా కీళ్ళ నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయని అంటున్నారు.  
  • సైక్లింగ్ చేయడం వలన మధుమేహం(షుగర్) అదుపులోకి వస్తుందని డయాబెటీషియన్లు అంటున్నారు. 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వలన 60% మధుమేహం అదుపులో ఉంటుందని చెబుతున్నారు. 
  • ప్రతిరోజూ  పచ్చని చెట్లు  చూస్తూ సైకిల్ తొక్కడం ద్వారా ఒత్తిడి, మానసిక వేదన, డిప్రెషన్ వంటివి  దూరం అవ్వడంతో పాటు  మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైక్రియాటిస్టులు  అంటున్నారు. మతిమరుపు, మానసిక సమస్యలు వంటివి కూడా తగ్గుముఖం పడతాయని అంటున్నారు. 

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved