చుండ్రు పోవాలంటే…

ఉంగరాల్లాంటి జుత్తు ఎంత ఒత్తుగా ఉన్నా.. తలలో చుండ్రు చేరితే కురులు వెలవెలబోతాయి. నలుగురిలో నగుబాటు చేసే చుండ్రు సమస్యను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

• వారంలో కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.

• ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరికి వచ్చాక షాంపూలా వాడితే మంచి ఫలితం ఉంటుంది.

• కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య కొంత తీరుతుంది.

• గసగసాలను మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.

• ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.

• మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి.

• కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.

• పారిజాతం గింజలను మెత్తగా నూరి దాన్ని నూనెలో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకోవాలి.

• పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి.. కాసిన్ని నీళ్లు కలిపి మాడుకు పట్టించాలి. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

• గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved