కాపాడండి......కాపాడండి అంటూ ......... వెక్కి వెక్కి ఏడ్చింది........, రెండు చేతులూ జోడించి వేడుకొంది........... , నా ప్రాణాలను కాపాడండి అంటూ ....... కాళ్ళు పట్టుకొని గుండెలవిసేలా రోదించింది........... , కానీ కనికరించని ఆ కసాయి గుండెలు ............. , కనీస మానవత్వాన్ని మరిచి......, ఇంట్లో నుండి బయటకు నెట్టి వేసారు............. , ఒక అమ్మాయి నిండు జీవితం కత్తిపోట్లకు గురయ్యేలా చేసారు. సంఘటన జరిగిన తీరును చదివితే ఎలాంటి వారి మనసైనా అయ్యోపాపం అని ద్రవిస్తుంది. ఒక్కసారి చదవండి....... దేశ రాజధానిలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో తెలుస్తుంది...... నేటి సమాజం మానవత్వాన్ని మరిచి ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతుంది. దేశ రాజధాని డిల్లీలో మీనాక్షి అనే అమ్మాయిని వేధించడమే గాక, తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే పగను పెంచుకున్న ఇద్దరు దుర్మార్గపు అన్నదమ్ములు......... ఆ యువతిని నడిరోడ్డుపై పరుగులు పెట్టించి మరీ కత్తి వేటుకు బలి చేసారు . ఒకసారి కాదు........ ఒకచోట కాదు.......... ఆ అమ్మాయి శరీరంపై అందిన చోట అందినట్లు కత్తితో 35 సార్లు పొడిచారు. నడి రోడ్డుపై జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోగా....... మాకెందుకు లెమ్మని తప్పించుకున్నారు. తనను ఆదుకొమ్మని అరచి..... అరచి ........ ప్రాధేయపడ్డా కూడా కనికరించని ఈ సమాజాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ........... అనంత లోకాలకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వివరాల్లోకి వెళితే........., డిల్లీలోని ఆనంద్ పర్వత్ ప్రాంతానికి చెందిన మీనాక్షి (19) ని , ఆమె ఇంటికి దగ్గరలోనే ఉన్న ప్రకాష్ అతని సోదరుడు తరచూ వేధిస్తూ ఉండేవారు. వారి వేధింపులు భరించలేక ఆ అమ్మాయి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానితో కక్ష పెంచుకున్న ఆ దుర్మార్గులు , గురువారం రాత్రి మీనాక్షి దగ్గరలోని మార్కెట్ కు వెళుతుండగా....... దారిలో ఆమెను అడ్డుకొని వేధించారు. దీనితో మీనాక్షి వారిపై తిరగబడింది. దీనితో రెచ్చిపోయిన ఆ దుర్మార్గులు విపరీతంగా కొట్టడంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. మరింత రెచ్చిపోయిన ఆ ముష్కరులు ఇష్టమొచ్చిన విధంగా ఆమెను కత్తితో పొడిచారు. అంత బాధలోనూ మీనాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళి ............. దగ్గరలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి తనను రక్షించమని వేడుకొంది. అయితే ఆ ఇంట్లోని వారు ఆమెను బయటకు నెట్టి తలుపులు మూసేశారు. దాంతో ఆ దుర్మార్గులు మరోసారి ఆమెపై దాడి చేసి దాదాపు 35 మార్లు కత్తితో పొడిచారు. దీంతో మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఆ దుర్మార్గులు చేసింది ఘోరమయితే , అక్కడి స్థానికులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. నిండు ప్రాణాన్ని బలిగొంది.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved