చదువుకోడానికి పంపితే శవమై వచ్చాడు.! కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయ్.

అమ్మా త్వరగా టిఫిన్ పెట్టవే బస్ కు లేటవుతుంది అంటూ వంటగదిలో ఉన్న అమ్మపై కేకలు వేస్తున్నాడు సుమంత్. ఇదిగో తిను అంటూ నాలుగు ఇడ్లీలు ప్లేట్లో వేసింది అమ్మ…రెండు ఇడ్లీలు తిని ప్లేట్ అక్కడ పెట్టి, భుజానికి బ్యాగ్ తగిలించుకొని బయలు దేరాడు సుమంత్ కాలేజ్ కి. అతను హైద్రాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ స్టూడెంట్.

బస్టాప్ దగ్గర RTC బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు సుమంత్.. కార్ల లో కాలేజ్ కు వెళ్ళే స్థోమత కానీ, కాలేజ్ స్పెషల్ బస్ లో వెళ్ళే స్థాయి కానీ లేని నిరుపేద కుటుంబం వారిది. కేవలం కొడుకుకు కన్వీనర్ కోటాలో మంచి కాలేజ్ లో సీటు వచ్చందనే కారణంతో ఉన్న రెండెకరాలు అమ్మకొని పట్నం వచ్చారు ఆ తల్లీదండ్రులు.

హారన్ కొట్టుకుంటూ బసు రానే వచ్చింది…బడబడా అందరూ ఎక్కేసారు. పుట్ బోర్డ్ తో సహా… సుమంత్ కూడా తన బ్యాగ్ తో పాటు సీట్లో కూర్చున్నాడు. బస్ నెక్ట్స్ స్టాప్ కు రాగానే అతని ఫ్రెండ్ వివేక్ బస్ ఎక్కాడు..అతడికి బస్ లోపలికి అడుగుపెట్టడానికి కూడా సందులేకపోవడంతో ఫుట్ బోర్డ్ మీదే సెటిల్ అయ్యాడు. అరె వివేక్ ఫివర్ వచ్చిందన్నావ్ కదరా తగ్గిందా అన్నాడు కిటికీలోంచి సుమంత్ వివేక్ తో ..లేదు రా అసైన్మెంట్ ఉందని కాలేజ్ కు వస్తున్న లేకపోతే రాకపోయేవాడిని అన్నాడు వివేక్.

ఇంతలో నెక్ట్స్ స్టాప్ వచ్చింది. అప్పుడు వివేక్ కు తన సీట్ ఇచ్చి, ఫుట్ బోర్డ్ మీద నిల్చున్నాడు సుమంత్…. కిటికీ లోంచి అరేయ్… ఈ ఇయర్ లో ప్లేస్ మెంట్ వస్తుందా? వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే.. వెంటనే మేఘన వాళ్ళింట్లో ఒప్పించి పెళ్ళి చేసుకుంటానని సుమంత్ తో చెబుతున్నాడు వివేక్. వస్తుంది లేరా! సెట్ అయిపోతావ్.. ప్రెండ్సందరం కలిసి నీ పెళ్ళి దూమ్ ధామ్ చేస్తాంలేరా అన్నాడు సుమంత్..

ఇంతలో బస్ కు ఎదురు బర్రె అడ్డం వచ్చింది..సడెన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. ఆ బ్రేక్ కు సుమంత్ చేతులోని డ్రాఫ్టర్ బస్ వెనుక టైర్ కింద పడి పగిలిపోయింది.. డ్రాఫ్టర్ తో పాటు సుమంత్ తల కూడా……. అప్పటి వరకు తనతో మాట్లాడిన ఫ్రెండ్ ఇలా విగతజీవిగా పడిఉండడాన్ని తట్టుకోలేక కళ్ళు తిరిగిపడిపోయాడు వివేక్. వివేక్ ఫోన్ నుండి MY HOME అని ఫీడ్ అయిన నెంబర్ కు కాల్ చేశారు… నాన్నా చెప్పురా అంటూ అవతలి నుండి సుమంత్ అమ్మ… అమ్మా..ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది, మీ కొడుకు చనిపోయాడని సమాధానం.

ప్పుడు హైద్రాబాద్ సిటీ బస్సులను ఒక్కసారి చూడండి.. ఉదయం వేళల్లో నగరశివార్లలోని కాలేజ్ లకు వెళ్ళే బస్సులను చూడండి.. కనీసం రెండు కాళ్ళు కూడా పెట్టుకోడానికి ఫుట్ బోర్డ్ మీద స్థలం ఉండదు. చాలీచాలని బస్సులు, కాలం చెల్లిన బస్సులు…వీటి ఖరీదు సొంత ఊరిని కాదని మరీ కొడుకు చదువుకోసం పట్నం వచ్చిన తల్లీదండ్రుల పుత్రశోకం.

please share this post


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved