బ‌స్టాండ్‌, రైల్వేస్టేష‌న్లో సెల్ చార్జింగ్ పెడితే చాల ప్రమాదం

సాధ్యమైనంతవరకు రైలు లో ఛార్జింగ్ పెట్టకండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలవుండవు ఏమైనా జరగవచ్చు చెప్పలేం... short circuit అయ్యే ప్రమాదం వుంటుంది.చాల మంది ఫోన్ ట్రైన్ లో ఛార్జింగ్ పెట్టి రాత్రి మొత్తం అలా వదిలేస్తారు... ఎట్టి పరిస్థితి లో అలా చెయ్యకండి చాల ప్రమాదం.. మీకు అంతగా అవసరం వుంటే పవర్ బ్యాంకు ఒకటి కున్నుకోండి MI power bank, Samsung power bank, ఇలా చాల రకాలు మార్కెట్ లో దొరుకుతాయీ..

ఇంకో ముఖ్యమైన విషయం

మీరు దూర ప్రాంతాల‌కు ట్రావెల్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ఆ అల‌వాటుకు గుడ్ బై చెప్పాల్సిందే. లేకుంటే మీ ఫోన్‌లో ఉన్న గుట్టు మొత్తం ఇత‌రుల‌కు తెలిసిపోవ‌చ్చు. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..!

ఈ చార్జ‌ర్ల‌లో మామూలు చార్జ‌ర్ కాకుండా ఓ ప్ర‌త్యేక‌మైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్‌ను ఈ చార్జ‌ర్‌తో చార్జింగ్ పెట్టాక త‌ర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. అంతే మీ ఫోనోలో ఉన్న మీ ప‌ర్స‌న‌ల్ గుట్టు మొత్తం వాళ్ల‌కు చేరిపోతుంది.

మ‌రో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఈ డేటా చోరీకి గుర‌య్యేలా హ్యాక‌ర్లు ఈ వ్య‌వ‌స్థ‌ను చాలా ప‌క‌డ్బందీగా త‌యారు చేశారు. ఇలా ప‌నిచేసే డివైజ్ పేరు ‘మీమ్’ దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved