గంటల కొద్దీ కూర్చుంటే సుగర్ వ్యాధి రావొచ్చట

ఇటీవల కాలంలో డయాబెటీస్ తో బాధపడే వారి సంఖ్య పెరిగిపోయింది. తీవ్రమైన ఒత్తిడి, పనివేళలు, ఆహారపు అలవాట్లు అందుకుకారణం కావచ్చు. వీటికి తోడు గంటల కొద్దీ కూర్చుని ఉండిపోతే కూడా టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం , కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటకు సుగర్ వ్యాధి ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సుగర్ వ్యాధి లేని వారితో పోలిస్తే.. సుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకు 26 నిముషాలు అధికంగా కూర్చుని ఉంటున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెబుతున్నారు. కూర్చోవడం వల్లే మధుమేహం వస్తుందనేది రుజువు కాలేదని, రెండింటి మధ్య సంబంధం మాత్రం ఖచ్చితంగా ఉందని వారు చెబుతున్నారు. సో.. ఇంట్లో అయినా.. ఆఫీసుల్లో అయినా గంటల కొద్దీ కూర్చీల్లో కూర్చుని ఉండిపోకుండా.. అప్పుడప్పుడు కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉండటం ఎంతైనా మంచిది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved