ఫోటో తీశాడు...కన్ను పోగొట్టాడు !!!

మూడు నెలల ముద్దు లొలికే పసి కందు. చూస్తేనే ముచ్చట వేస్తుంది, ఇక ఫోటొ తీయకుండా ఆగడం ఎలా?? పిల్లలు పుట్టిన మొదటి రోజు నుండి వారి ఫోటో లు తీసి స్నెహితులందరికి చూపడం ఇప్పుడు ఆనవాయితి అయిపోయింది.

ఎన్నో భంగిమల్లో వారిని ఫోటోలు తీసి, వారి చేష్ఠలని చూస్తూ మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. కానీ, ఫోటోలు తీసేటప్పుడు ఒక వేళ ఫ్లాష్ పసి గుడ్డు కళ్లల్లో పడితే ప్రమాదం అని ఎంత మందికి తెలుసు?? ఆ ఫ్లాష్ ఎంత ప్రమాదం అంటే, చిన్ని ప్రాణం కనుల కాంతి ని దోచుకునేంత....!!!

ఇలాంటి సంఘటనే చైనాలో తల్లిదండ్రులకు ఎదురైంది,

బాబును చూడడానికి వచ్చిన బంధువు ఒకరు బాబుకు చాలా దగ్గరగా ఫోటో తీసాడు. ఫ్లాష్ ఆఫ్ చేయడం మరవడంతో, ఆ ఫ్లాష్ దెబ్బకి బాబు కన్ను మసకబారింది. ఫోటో తీసిన వెంటనే బాబు కళ్లలో తేడా కనపడడంతో తల్లిదండ్రులు, బాబుని డాక్టర్ల దగ్గరకు తీసుకుపోయారు.

అయితే, ఆ బాబు కుడి కన్ను పూర్తిగా దెబ్బతినిందని, తిరిగి తీసుకురాలేమని డాక్టర్లు చెప్పడంతో బాబు తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లారు. నెలల పసికందు... వాడి నిండు జీవితం చిన్న సరదా కోసం బలి అయిపోయింది...

ఫోటోలు తీయాలి... ఆ క్షణాలను ఎప్పటికీ ఉంచుకోవాలి... అయితే... ఫోనును పిల్లలకు మరీ దగ్గరగా పెట్టకూడదు, ఫ్లాష్ ఆఫ్ చేసి మాత్రమే ఫోటోలు తీయాలి...ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

4 సంవత్సరాల వరకు పిల్లల కళ్లు బలమైన కాంతి కిరణాలు తట్టుకునే శక్తిని కలిగి వుండవు.

అందుకే, తస్మాత్ జగ్రత్త జాగ్రత్త!!!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved