పిల్లలూ అతిగా స్మార్ట్ ఫోన్ వాడితే మెల్లకన్నే

అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సౌకర్యంతో పాటు ఇబ్బందులు , ప్రమాదాలు కూడా పొంచి వున్నాయి. ఇక సెల్ ఫోన్ లలో స్మార్ట్ ఫోన్ ని పిల్లలు విచ్చల విడిగా వాడితే, ప్రమాదం వుందట. అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల నేత్రాలు విచలనం(మెల్లకన్ను) చెందే ముప్పు ఉందట. ఈ మేరకు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏకదాటిగా అరగంట పాటు స్మార్ట్‌ఫోన్‌ తెరను చూడకుండా నిరోధించాలని సూచించారు. అతిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించడానికి.. మెల్లకన్నుకు సంబంధం ఉందని దక్షిణ కొరియాలోని చొన్నం జాతీయ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు తెలిపారు. ఏడు నుంచి 16 ఏళ్ల వయసున్న 12 మందిపై ఈ పరిశోధన చేశారు. వారు రోజూ నాలుగు నుంచి ఎనిమిది గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించేలా చేశారు. స్మార్ట్‌ఫోన్‌ తెర, వారి కంటి చూపునకు మధ్య 20 నుంచి 30 సెంటిమీటర్ల దూరం ఉంచినట్లు పరిశోధకులు తెలిపారు. రెండు నెలల్లోనే 12 మందిలో 9 మంది నేత్రాల్లో వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించారు.. ఇక తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలి లేకుంటే ఇబ్బందేగా.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved