పరగడుపున మంచినీరు తాగటం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగా పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. నీటిని ఎక్కువగా తాగనివారు కూడా ఒకసారి మరల ఆలోచించండి. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మంచినీళ్ళు తాగడం ప్రారంభించండి. * పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. * కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి పెంచుతుంది. + పొద్దునే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువుతగ్గడానికి ఉపయోగపడుతుంది. * రక్త కణాలను శుద్ధిచేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంథుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా, శరీర ద్రవపదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా పోరాడుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved