ఓడిపోతే బాధపడకు, గెలిచేంతవరకు పోరాడు.

డీయస్సీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. రెండు మార్కుల్లో టీచర్ ఉద్యోగం మిస్సయిందని బాధ పడుతూ ఇంటికి వచ్చాడు రమేష్.

తన గదిలో కుమిలిపోతూ కూర్చొన్న రమేష్ దగ్గరికి తన తండ్రి వెళ్ళి, " ఎందుకురా......! అంతగా బాధపడుతున్నావ్..........ఇప్పుడు కాకుంటే.........మరోసారి వస్తుంది.దాని కోసం అంతలా కుమిలిపోతే ఎలా......? అని రమేష్ ను అతని తండ్రి సముదాయించాడు. " నేను కష్టపడి చదివాను నాన్నా........, ఈసారి తప్పకుండా వస్తుందనుకున్నాను..........., అందరికీ జాబ్ గ్యారెంటీ అని చెప్పుకున్నాను................, ఇప్పుడిలా జరిగింది.............., ఫ్రెండ్స్ , చుట్టాలు అందరూ నన్ను ఎగతాళిగా చూస్తారు నాన్నా........! అని బాధతో అన్నాడు రమేష్.

" నువ్వు కష్టపడి ప్రయత్నించావు.కొద్దిలో చేజారింది.మరో సారి ఇంకా గట్టిగా ప్రయత్నించు.అంతేగానీ ఇలా నీలో నువ్వే కుమిలిపోతే ఎలా........? నువ్విలా బాధపడుతూ కూర్చున్నావని తెలిస్తే, అందరూ నిన్నింకా చులకనగా చూస్తారు. ఇప్పుడు జాబ్ రాలేదనే ఫీలింగ్ ను నీ బాడీ లాంగ్వేజ్ లో కనపడనీయకు. ఎప్పుడైతే నెక్స్ట్ టైం కచ్చితంగా జాబ్ తెచ్చుకోగలననే......... ఆత్మవిశ్వాసం నీ ముఖంలో కనపడుతుందో........ , అప్పుడు నిన్ను ఎగతాళి చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. ఈలోకం తీరింతే, గెలిస్తే చప్పట్లు కొడతారు.ఓడితే గేలి చేస్తారు.అలాంటి వారి గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావంటే........ జీవితంలో ఏమీ సాధించలేవు. ఈసారి గట్టిగా ప్రయత్నించు...... అని భుజం మీద చేయి వేసి , పద........ అలా గుడి వరకు వెళ్ళి వద్దాం" అని రమేష్ ను అతని తండ్రి పిలిచాడు. రమేష్ కుర్చీలోంచి లేస్తూ, ఒక ఫ్రెండులా తన తండ్రి ఇచ్చిన సపోర్టుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved