పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉండే గుడ్లు

ఎల్లప్పుడూ తినటానికి వీలుగా ఉండే గుడ్లు చాలా చవకైనవి. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను తినడం పూర్తిగా మానేస్తుంటారు. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన మనలో చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతూ ఉంటారు. కోడి గుడ్డులో విటమిన్‌ డి దండిగా ఉండటం వలన గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం ఆరోఘ్యానికి చాలా మంచిది. శారీరకశ్రమ బాగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి గుడ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఉదయంపూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే బరువు తగ్గటానికీ ఉపయోగ పడతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved