మన దేశంలో పేదరికం వల్ల చాలా మంది పిల్లలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పొట్ట కూటి కోసం దినసరి కూలీలుగా మారి , జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో , మా స్నేహహస్తం డెవలప్ మెంట్ లో “ విద్యా సుమం “ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాము. గత ఆరు సంవత్సరాల నుండి , ప్రతి సంవత్సరం జూన్ నెలలో పది హేను రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం 720 మంది విద్యార్థులను గుర్తించి,వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, పలకలు, కంపాస్ బాక్సులు , పెన్నులు మరియు ఇతర సామాగ్రిని ఇస్తున్నాము. అదే విధంగా పూర్తిగా నిరుపేదలైన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి “ స్టూడెంట్ కార్డ్ “ లను పంపిణీ చేసి , వారు చదువును పూర్తి చేసేంతవరకు మా స్నేహహస్తం సొసైటీ ద్వారా అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఏర్పాట్లు చేసాము.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved