అడుగడుగునా నీటి కాలుష్యం మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటోంది. నీటి కాలుష్యం బారిన పడి లక్షలాది మంది ప్రజలు వ్యాధులతో నలిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ నీటి నిల్వలు అత్యంత వేగంగా అడుగంటిపోతూ, ఉన్న నీరు కూడా కాలుష్యం బారిన పడుతోంది. తాగే మంచి నీటి కోసం ప్రపంచంలోని ప్రజలంతా ప్రతి రోజూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. చాలా మంది ఆర్వో ప్లాంట్ల నుండి వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల వ్యర్థాల వల్ల నదులలోని నీరు కూడా కాలుష్యం బారిన పడుతోంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని “ ఫిల్టర్ స్ట్రా “ అనే కొత్త పరికరాన్ని తయారుచేసారు శాస్త్రవేత్తలు. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు అనువుగా రూపొందించారు. చాలా దేశాల నీటిలో వీటిని పరీక్షించి చూసారు. ఫలితాలు పూర్తి విజయవంతమయ్యాయి.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved