భారత్ గెలుపు

బెంగళూరులో బంగ్లా, భారత్‌ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో విజయం చివరికి భారత్‌నే వరించింది. బంతి బంతికీ విజయం ఇరు జట్ల మధ్య దోబుచులాడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. తమీమ్ ఇక్బాల్ 35, సబ్బీర్ 26, షకీబుల్ 22 పరుగులు చేసారు. మ్యచ్ ఇక బంగ్లాదేశ్ గెలిచినట్టే అనుకుంటున్న సమయంలో చివరి ఓవర్ నాలుగో బంతికి రహీమ్ ఔట్ కావడంతో మళ్లీ భారత్ గెలుపుపై ఆశలు చిగురించాయి. అప్పటికి 2 రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో మళ్లీ పాండ్యా బౌలింగ్‌లో మహ్మదుల్లా ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. భారత ఆటగాళ్లందరూ ఓక చోటుకి గుమిగూడి మంతనాలు జరిపారు. ఇక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాటింగ్‌కు దిగిన షువగటా ఇన్నింగ్ షాట్ ఆడలేకపోయాడు. పాండ్యా బంతిని కొంచెం వైడ్‌డ్‌గా వేయడంతో రన్‌కోసం ప్రయత్నించారు. కానీ ధోని చాకచక్కంతో రనౌట్ చేయడంతో విజయం భారత్ సొంతం అయ్యింది.

Here is Dhoni Luck and tallent

MS Dhoni's brilliance behind the Wickets.

MS Dhoni's brilliant stumping to dismiss Shabbir last night in a thriller.#IndvBan #WT20 VC - ICC

Posted by Circle Of Cricket on Wednesday, March 23, 2016

బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపుకు ముఖ్య కారణం ఆఖరి ఓవర్. చివరి ఓవర్‌లో బంతిని పాండ్యాకు ఇచ్చే ముందు ధోని ఏదో మాట్లాడాడు. అదే మ్యాచ్‌ను గెలిపించిందనేది అభిమానుల అంచనా. అయితే ఇదే విషయం గురించి ధోని మాట్లాడుతూ తనకు వైడ్‌లు వేయవద్దని చెప్పినట్టు తెలిపాడు. బ్యాట్స్‌మెన్ సింగిల్ రన్‌ తీయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారని అందుకే కీపర్ చేతిలోకి బంతి వెళ్లేలాగా టార్గెట్ చేయాలని సూచించినట్టు చెప్పాడు. మా ఆలోచనల్ని పాండ్యా చక్కగా అమలు చేసాడని అదృష్టం మా వైపునే ఉండటంతో మ్యాచ్ గెలవగలిగామని వివరించాడు కెప్టెన్ కూల్.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved