తొలిసారిగా రెండుచేతులు మార్పిడి

ప్రపంచంలోనే తొలిసారిగా ఎనిమిదేళ్ళ బాలుడికి రెండు చేతుల్ని మార్పిడి ప్రక్రియ ద్వారా అమర్చారు. అమెరికాలో పది గంటల పాటు నిర్వహించిన శస్త్ర చికిత్సతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసారు. జియాన్ హార్వే అనే చిన్నారికి కొన్నేళ్ళ క్రితం తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా రెండు చేతులు, పాదాన్ని తొలగించారు. మిత్రపిందల మార్పిడి కుడా జరిగింది. ఇటివలే చిన్నారికి దాత నుంచి సేకరించిన చేతులు, భుజాల్ని శస్త్ర చికిత్స బృందం అమర్చింది. 40మందితో కూడిన వైద్య బృందం శ్రమ ఫలించింది. ఏళ్ల కొద్ది శిక్షణ నెలల కొద్ది ప్రణాళిక ఓ బృందం కసరత్తు ఫలితమే. ఈ శస్త్ర చికిత్స అని ఫిలిడేల్ఫియాలోని శిశు వైద్యశాలకు చెందిన ష్కాట్ లెవిన్ పేర్కొన్నారు. శ్రినేర్స్ శిశు ఆస్పత్రి, ఫిలడెల్ఫియ శిశు వైద్యశాల మధ్య సమన్వయంతో ఈ మార్పిడి ప్రక్రియ విజయవంతమైందని ఓ చిన్నారిపై ఈ తరహా శస్త్ర చికిత్స మునుపెన్నడూ జరగలేదని శ్రినేర్స్ ఆస్పత్రి నిఫునులు స్కాట్ కోజిన్ తెలిపారు. అవయవ మార్పిడి జరిగిన బాలుడు త్వరగానే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని భావిస్తున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved