వారానికి రెండుసార్లు చేపలు తింటే షుగర్‌ దూరం

మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడమేనని సూచిస్తున్నారు వైద్యులు. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా–3తో సమానమని చెబుతున్నారు.

మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్‌–2 డయాబెటిస్‌ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా–3 ఆమ్లాలను ఆహారంలోభాగంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్‌ దుష్ఫలితాలు 48 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

హెల్తీఫుడ్ అంటే ఏదీ, ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు ఇలా పలు రకాల సందేహాలు మనలో కలగవచ్చు. మాంసాహారం ఎన్ని రోజులకొకసారి తీసుకోవచ్చు. ఇలా అనేక సందేహాలు. అయితే, మన రెగ్యులర్ డైట్ శాఖాహారమైన, మాంసాహారమైన సరే సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తం. మాంసాహార ప్రియులైతే మీ రెగ్యులర్ డైట్ చేర్చుకోవల్సిన ఒక ముఖ్యమైన ఫుడ్ చేపలు. చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్ మరియు విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలను ప్రతి రోజూ లేదా వారానికొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు మనం చాలా యాక్టివ్ గా కూడా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.

గుండె జబ్బుల నివారణకు: చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను)నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది

కంటి చూపుకు: సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. ఎముకల బలానికి : చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం.

రక్త హీనత: రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది.

మెదడుకు: అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved