చేప నూనె వాడడం వలన ప్రయోజనాలు.....

మనలో చాల మందికి చేపలు అంటే ఇష్టం ఉండదు కాని చేపల వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా చేపలను తినడం వలన శరీరానికి కావలసిన కీలక పోషకం అయినట్టి ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు శరీరానికి అందించబడతాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేసి, రక్త ప్రవాహంలో ద్రావణ స్థాయిలను మెరుగుపరచి, ఇన్ఫ్లమేషన్, నొప్పి మరియు వాపు వంటి వాటిని తగ్గిస్తాయి. చేప నూనె జుట్టు ఆరోగ్యాన్ని, జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ ఔషదంగా చేప నూనెను చెప్పవచ్చు.

చేపలో నూనెలో ఉండే ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు, ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, అధిక బరువును కూడా తగ్గిస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది. ఈ నూనె గోళ్ళను మృదువుగా మరియు బలంగా మారుస్తుంది. కావున, మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అనుకంటే రెడ్ మీట్ కు బదులుగా చేపలను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved